Biggboss 6 : బిగ్‌బాస్ హౌస్ అంటేనే ఇంటర్‌లో శ్రీ చైతన్య కాలేజ్ మాదిరి. రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్‌ని కొదవ ఉండదు. ఎటు చూసినా కెమెరాలే. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండలేదు. లేదంటే బుక్ అయిపోతారు. పనిష్‌మెంట్స్, తదతర చర్యలుంటాయి. ఇక కాలేజ్‌లో వెళ్లీ వెళ్లగానే ఇమడలేనట్టు కంటెస్టెంట్స్ సైతం ఇబ్బంది పడిపోతుంటే.. గలాటా గీతూ మాత్రం తన సొంత ఇంట్లో ఉంటున్నట్టుగా ఫీలవుతోంది. తొలిరోజు నుంచే రచ్చ ప్రారంభించిన గీతూ.. రెండో రోజు సైతం తన హవాను కొనసాగించింది. వాష్ రూమ్‌లో హెయిర్ పడిపోయింది. తాను తీసేది లేదంటూ ఇనయా సుల్తానాపై గీతూ ఫైర్ అయ్యింది. బిగ్‌బాస్ చెయ్యమన్నా చెయ్యనంటూ తెగేసి చెప్పింది.
ఇక ఇనయా సుల్తానాను రెండో రోజు కూడా గీతూ వదల్లేదు. బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో తొలి రోజు నుంచే గీతూ కారణంగా గొడవలు మొదలయ్యాయి. రెండో రోజే గీతూ.. ఇనయ సుల్తానా మధ్య ‘హెయిర్’ వార్ జరిగిన విషయం తెలిసిందే. బాత్రూంలో స్నానం చేసిన వారు అక్కడి హెయిర్‌ని తీసేయాలని గీతూ అంటే.. నాతోనే ఎందుకు చెప్తున్నావని ఇనయ సుల్తానా వాగ్వాదానికి దిగింది. తిక్కదానా.. తిక్కమ్మా అంటూ రెచ్చిపోయింది గీతూ. ఇనయా సైతం గీతూని నీకే తిక్క అంటూ ఫైర్ అయ్యింది. అది మనసులో పెట్టుకుందో ఏమో కానీ గీతూ.. రెండో రోజు ఇనయాతో ఓ ఆట ఆడుకుంది.
Biggboss 6 : క్లాస్ టీమ్‌లోకి చేరిపోయిందో లేదో గలాటా మొదలు పెట్టేసింది..
నిన్న బిగ్‌బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ట్రాష్ నుంచి ఒకరు క్లాస్ సభ్యుడితో స్వాప్ చేసుకోవచ్చని చెప్పాడు. అలా గీతూ క్లాస్ టీమ్‌లోకి ఎంటరవగా.. బాలాదిత్య ట్రాష్ టీమ్‌లోకి వచ్చి చేరాడు. గీతూ అలా క్లాస్ టీమ్‌లోకి చేరిపోయిందో లేదో గలాటా మొదలు పెట్టేసింది. ఇనయను టార్గెట్ చేసి కావాలని ఆమెతో పనులు చేయించుకుంది. అది తీసుకురా.. ఇది తీసుకురా అంటూ సతాయించింది. ఇనయాకు ఒకానొక టైమ్‌లో కాస్త విసుగు కూడా వచ్చేసింది. టోటల్‌గా మాస్ సభ్యులతో సపర్యలు చేయించుకుని సంబరపడిపోయింది. మొత్తానికి ఇప్పటి వరకైతే గీతూనే హైలైట్ అవుతోంది.