Bigboss 6 : నామినషన్స్ సమయంలో ఉండే మజా.. మిగిలిన ఆరు రోజుల్లో లభించదంటే అతిశయోక్తి కాదు. ఈ వారం శ్రీ సత్యతో నామినేషన్స్ ప్రారంభించారు బిగ్ బాస్. ఇష్టం లేని ఇద్దరు కంటెస్టెంట్స్ ముఖంపై పెయింట్ రాసి.. నామినేట్ చేయాలనన్నారు. దానిలో భాగంగా శ్రీ సత్య.. ఆరోహిని నామినేట్ చేసింది. పడుకుని.. పడుకోలేదని రాజ్‌తో గొడవపడటం తనకి నచ్చలేదని చెప్పింది శ్రీ సత్య. ఆ తరువాత ఇనయని నామినేట్ చేసింది. అటు ఇనయ, ఆరోహిలు తనని వరస్ట్ అని చెప్పడంతోనే శ్రీ సత్య నామినేట్ చేసినట్టు చెప్పింది.
అయితే శ్రీ సత్య-ఇనయల మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. ఒకరిని ఒకరు కించపరుచుకుంటూ దారుణంగా దూషించుకున్నారు. ఇదిలా ఉండగా.. ఓ సినిమాలో బాలయ్య బాబు డైలాగ్ ఉంటుందే.. ఎవరైనా నాకెదురొచ్చినా వారికే నష్టం.. నేను ఎవరికైనా ఎదురు వెళ్లినా వారికే నష్టం అని ఆ డైలాగ్ గీతూకి బాగా సెట్ అవుతుందని అనిపించింది. అమ్మడి నోటికి మొక్కాలే. బాబోయ్.. ఎవరైనా ఆమెను నామినేట్ చేసినా వాళ్లకే నష్టం.. ఆమె ఎవరినైనా నామినేట్ చేసినా వాళ్లకే నష్టం అన్నట్టుగా ఉంది. నోరేసుకుని పడిపోతుంది. ఎదుటి వారికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వదే..
Bigboss 6 : గీతు నామినేషన్స్.. సుదీప, చంటి
మొదటిగా గీతుతో.. నేహా గొడవపడింది. సంచాలక్‌గా ఆమె సరిగా చేయకపోవడం వల్లే గేమ్ డిస్ట్రబ్ అయ్యిందని చెప్పిన గీతు ఆమెను నామినేట్ చేయకుండా సుదీపని నామినేట్ చేసింది. బేబీల గురించి ఎమోషనల్ జర్నీ జరుగుతున్నప్పుడు.. ఏడ్చి టిష్యూలు అక్కడే విదిలేసిందని చెప్పింది. ఇంత సిల్లీ రీజన్‌ని నువ్ నామినేట్ చేశావంటే నీ బుద్ధి ఎలాంటిదో అర్ధమైందని అన్నది సుదీప. అసలు సుదీప.. రియల్‌గా ఉండటం లేదని చెప్పింది గీతు. అయితే ఈ రీజన్లు అంత సిల్లీగా ఉంటే ఏం చేయాలి? టూమచ్ కదా. రెండో నామినేషన్‌గా చంటిని ఎంచుకుంది. బయట ఒకలా ఉండి.. ఇక్కడ కెమెరాల కోసం రియల్‌గా ఉండటం లేదని చెప్పింది. తాను కూర చేశాననే రీజన్‌తో తినకుండా ఉండటంపై హర్ట్ అయినట్టు చెప్పింది గీతు.