Bigboss 6 : బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కి శనివారం హోస్ట్ నాగార్జున గట్టిగా క్లాస్ పీకిన విషయం తెలిసిందే. ఆదివారం మాత్రం వారితో చాలా సరదాగా గడిపాడు. సండే అంటే ఫన్ డే కాబట్టి అందుకు తగ్గట్టే సరదా గేమ్స్‌తో పాటు తమన్నా సందడితో ఆదివారం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. చివరికి ఎలిమినేషన్ సమయం రానే వచ్చింది. ఒకరిని ఎలిమినేట్ చేసి అందరిని ఏడిపించాడు బిగ్‌బాస్. మరి ఆ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరు? తమన్నా తీసుకొచ్చిన కానుక ఎవరికి దక్కింది? బిగ్‌బాస్ హౌస్‌లో బౌన్సర్ ఎవరు? అనే విషయాలతో నిన్నటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.
మగవాళ్లను, ఆడవాళ్లను వేరు వేరు టీమ్‌గా కూర్చోబెట్టాడు నాగ్. తర్వాత తమన్నాని పరిచయం చేశాడు. బాయ్స్ అంతా లేడి కంటెస్టెంట్స్‌లో ఎవరు బౌన్సర్ కావాలనుకుంటున్నారో చెప్పి వారి చేతికి బ్యాండ్ కట్టాలని చెప్పాడు. బాయ్స్ అంతా లేడి కంటెస్టెంట్స్‌లో ఎవరు బౌన్సర్ కావాలనుకుంటున్నారో చెప్పి వారి చేతికి బ్యాండ్ కట్టాలని చెప్పారు నాగ్. ఒక్కొక్కరు తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌కి బ్యాండ్ కట్టారు. ఆదిరెడ్డి వెళ్లి గీతుకు బ్యాండ్ కట్టాడు. ‘గీతు దగ్గర బాడీ లేదు కానీ ఆమె మాటలు నాకు బౌన్సర్‌లా పని చెస్తాయి’ అని ఆదిరెడ్డి చెప్పాడు.
Bigboss 6 : ఆడియన్స్ అంతా గట్టిగా ఈళలు వేశారు..
బాలాదిత్య వెళ్లి గీతూకే బ్యాండ్ కట్టాడు. బిగ్‌బాస్ నుంచి తనను కాపాడానికే గీతూని బౌన్సర్‌లా ఎంచుకున్నానని చెప్పాడు. ఇక అర్జున్ కల్యాణ్ తన చాయిస్‌గా శ్రీసత్యను ఎంచుకున్నట్లు చెప్పగానే.. ఆడియన్స్ అంతా గట్టిగా ఈళలు వేశారు. వారిని చూసి ఏంటి ఇంత స్పందన అని నాగ్ అడగ్గా.. ‘వారి మధ్య ఏడో ఉంది అని ఓ యువతి చెప్పడంతో అందరూ గట్టిగా నవ్వారు. ‘అదేం లేదు సర్.. మేం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే’ అని అర్జున్ అన్నాడు. ఇక శ్రీహాన్ తన బౌన్సర్‌గా ఆరోహిని ఎంచుకున్నాడు. ఇలా హౌస్‌లోని 10 మంది మగవాళ్లు.. తమకు నచ్చిన వాళ్లకి బ్యాండ్ కట్టారు. అయితే ఎక్కువ మంది గీతూకి బ్యాండ్ కట్టడంతో గీతూని బౌన్సర్‌గా నాగ్ అనౌన్స్ చేశారు.