Geethu : హిందీతో పాటు అన్ని భాషల్లోనూ అలరిస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షో తెలుగులోనూ ఆరో సీజన్‌ను ప్రారంభించింది. గత ఆదివారం మొదలైన ఈ షో కోసం 21 మంది కంటెస్టెంట్లను నిర్వాహకులు తీసుకున్నారు. తొలి నామినేషన్ కార్యక్రమం కూడా పూర్తైంది. తొలి రోజు నుంచి బాగా హైలైట్ అవుతున్న వారిలో ముఖ్యంగా సింగర్ రోహిత్, గలాటా గీతూ ఉన్నారు. సింగర్ రోహిత్ వచ్చేసి తన స్వభావమే అంతో లేదంటే అలా బిహేవ్ చేస్తున్నాడో కానీ కొంచెం అతని తీరు పలువురు కంటెస్టెంట్స్‌కు ఇబ్బందికరంగా ఉంది. దీంతో నామినేషన్స్‌లో అతనికే ఎక్కువ ఓట్లు పడ్డాయి. మొత్తంగా రేవంత్‌కు 8 ఓట్లు పడ్డాయి.
అయితే రేవంత్‌కు ఎలిమినేషన్ గండం అయితే లేదు. పక్కాగా గట్టెక్కుతాడు. అతనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. మొత్తానికి రేవంత్ స్వతహాగానే కాస్త గట్టిగా మాట్లాడతాడని తెలుస్తోంది. మాస్క్ వేసుకుని నటించడం అయితే తొలి రోజు నుంచి లేదు. తనేదైనా అనుకుంటే దానిని గట్టిగానే చెబుతున్నాడు. అయితే అది కొందరికి నచ్చడం లేదు. తాజాగా నేడు రిలీజైన ప్రోమోలో కూడా రేవంతే హైలైట్ అవడం గమనార్హం. ‘నామినేషన్‌లోకి రావడం పాపం కాదు, జనాలు నిన్నేమీ బూతులు తిట్టుకోరు’ అంటూ నామినేషన్స్ హీట్ నుంచి రేవంత్‌ను బయటకు తీసుకొచ్చి ఓదార్పునిచ్చే ప్రయత్నం ఆదిత్య చేస్తున్నట్టుగా ప్రోమోలో చూపించారు.
Geethu : గీతూ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు..
ఇక గలాటా గీతూ.. ఛాన్స్ దొరికితే చాలు అందరినీ చెడుగుడు ఆడేసుకుంటోంది. అయితే గీతూ మాత్రం ఆయన ఎంత త్వరగా బయటకు వెళ్తే ఆయనకే మంచిది అని వేదాంతం పలికింది. అసలే గీతూకి బయట నెగిటివిటి కావల్సినంత ఉంది. ఇక షోలో ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ.. ఎవరితో పడితే వాళ్లతో గొడవలు పెట్టుకుంటూ పోతే.. నామినేషన్స్‌లోకి రాగానే ఇతర కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ అంతా కలిసి బయటకు లాక్కొచ్చేస్తారు. అసలే.. తానొక ట్రాషీనంటూ అమ్మడు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. అమ్మడు హౌస్ లోపల ప్రతి ఒక్కరినీ ఒక ఆట ఆడుకుంటుంటే.. బయట నెటిజన్స్ ఆమెను ఒక ఆట ఆడేస్తున్నారు.