Biggboss 6 : బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయ్యి రెండో వారం చివరికి వచ్చేసింది. ఇక హోస్ట్ నాగార్జున ఇవాళ వచ్చి తప్పొప్పుల లెక్కలు తేల్చడమే తరువాయి. అయితే మొదటి వారానికి సంబంధించి ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరిగినా గాని నో ఎలిమినేషన్ అని ఎవరిని హౌస్ నుండి ఎలిమినేట్ చేయలేదు. ఈ వారం మాత్రం ఎలిమినేషన్ పక్కా. ఇక ఈ విషయాలను పక్కనబెడితే బిగ్‌బాస్ సీజన్ 6 రెండో కెప్టెన్‌గా రాజ్ ఎంపికయ్యాడు. కెప్టెన్‌గా ఎంపికవడం ఏమో కానీ రాజ్ మాత్రం నామినేషన్స్ గండం నుంచి బయట పడినట్టు తెలుస్తోంది.
ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా రాజ్ కాస్త వాయిస్ పెంచడం.. టాస్క్‌లో సత్తా చాటడంతో ప్రేక్షకుల్లో రాజ్ గ్రాఫ్ బాగా పెరిగిపోయిందట. దీంతో ఓటమి గండం తప్పిపోయినట్టేనని తెలుస్తోంది. ఇక కెప్టెన్సీ టాస్క్‌లో ఒకవైపు రచ్చ లేపే సాంగ్స్… అవి అయిపోయిన వెంటనే కెప్టెన్‌కి ఓటింగ్ కార్యక్రమాన్ని బిగ్‌బాస్ కండక్ట్ చేశారు. దీనిలో భాగంగా కొందరు కంటెస్టెంట్స్ యూత్‌కి పిచ్చెక్కించేశారు. సామీ సామీ పాటకి ముద్దుగుమ్మలంతా కలిసి స్టెప్పులు వేశారు. అయితే వాసంతి క్రిష్ణన్.. అందాలన్నీ బయటపెట్టే డ్రెస్ వేసి నాభి సోయగాలతో రచ్చ చేసింది. ఆ తరువాత అభినయ శ్రీ, బాలాదిత్యలు డిస్కషన్ చేసి.. కెప్టెన్‌గా రాజ్‌కి జై కొట్టారు. అయితే కెప్టెన్‌గా గట్టి పోటీ ఇచ్చిన ఇనయ కన్నీళ్లు పెట్టుకుంది.
Biggboss 6 : అది చెప్పడానికి రేవంత్ చాలా కష్టపడ్డాడు..
ఆ అమ్మాయి గురించి ఒకటి చెప్పాలి సినిమా ప్రమోషన్స్ సైతం మరోవైపు జరిగిన విషయం తెలిసిందే. దీని కోసం హీరో హీరోయిన్లు సుధీర్ బాబు, క్రితి శెట్టిలు గెస్ట్‌లుగా వచ్చి హౌస్‌లో సందడి చేశారు. ఇంటి సభ్యులతో సరదా సరదా టాస్క్‌లు ఆడించారు. పాపులర్ డైలాగ్‌లు చెప్పించారు. మొదటిగా మహేష్ బాబు పాపులర్ డైలాగ్.. ‘ఎవడు కొడ్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు’ అనే డైలాగ్ చెప్పడానికి రేవంత్ చాలా కష్టపడ్డాడు. ఆ తరువాత గీతు.. బుజ్జిగాడు డైలాగ్‌తో అల్లాడించింది. చివర్లో అయితే కాస్త ఓవర్ అయినట్టు అనిపించింది కానీ ఓవరాల్‌గా మాత్రం అదరగొట్టింది.