Bigg boss 6 : అసలే గీతూకి బాలాదిత్యకు పెద్దగా పడటం లేదు. ఎడమొహం పెడమొహం గానే ఉంటూ వస్తున్నారు. అలాంటిది.. హోస్ట్ నాగార్జున వచ్చి పెద్ద మంటే పెట్టారు.ఈ మధ్య ఒక టాస్క్ సమయంలో గీతూ తన ఎడ్యుకేషన్ గురించి వెటకారంగా మాట్లాడిందని.. బాలాదిత్య ఫుల్ ఫైర్ అయిపోయాడు. మనోడిని ఇప్పటి వరకూ రేలంగి మామయ్యా అనుకుంటుంటే ఆ రోజున మాత్రం శివాలెత్తిపోయాడు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుందని.. తప్పు తప్పు అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయిపోయాడు. కనీసం గీతూ ఏదో చెప్పబోతున్న వినే పరిస్థితిలో కూడా లేడు.
ఆ తరువాత కూడా ఒకటి రెండు సందర్భాల్లో గీతూపై బాలాదిత్యకు కోపం వచ్చింది.కానీ ఒరిజినల్ క్యారెక్టర్ రేలంగి మామయ్య కదా.. ఏదో సర్దుకు పోతున్నాడు. ఈ క్రమంలో బ్యాటరీ రీచార్జ్ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ చెప్పిన విషయాన్ని గీతూ ట్విస్ట్ చేసింది.బ్యాటరీ రీచార్జ్ కావాలంటే హౌస్ మొత్తం షుగర్ మానేయాలని లేదంటే బాలాదిత్య స్మోకింగ్ మానేస్తే ఇంటి బ్యాటరీ 90 శాతం పెరుగుతుందని చెప్పాడు. దీనిని గీతూ మార్చేసి చెప్పింది. హౌస్ మొత్తం బ్యాటరీ రీచార్జ్ కోసం షుగర్, సాల్ట్ తదితర వస్తువులన్నీ స్టోర్ రూమ్‌లో పెట్టేయాలని చెప్పారని లేదంటే బాలాదిత్య సిగిరెట్ మానేయాలని చెప్పారని చెప్పింది.
హౌస్ మొత్తం షుగర్, సాల్ట్ ఇతర వస్తువులన్నీ స్టోర్ రూంలో పెట్టేసి ఇబ్బంది పడటం కంటే తానొక్కడే ఇబ్బంది పడదామని బాలాదిత్య శాక్రిఫైస్కి సిద్ధమైపోయాడు.అయితే గీతూ అందరి ముందూ చెప్పడమే కాస్త అతనికి బాధ అనిపించింది. వెళ్లి గీతూని కాసింత కోపంగానే అడిగేశాడు.ఆ తరువాత కూడా సిగిరెట్స్ కోసం బాలాదిత్య బాగా ఇబ్బంది పడిపోయాడు.వెళ్లి తన బాధను బిగ్‌బాస్ దగ్గర మొర పెట్టుకున్నాడు కూడా. అయినా బిగ్‌బాస్ కరుణించలేదు.ఇవాళ నాగ్ వచ్చి అసలు బిగ్‌బాస్..గీతూకి ఏం చెప్పారు? అనేది కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి మరీ వీడియోని ప్లే చేసి చూపించారు. దీనికి ఇక మన రేలంగి మామయ్య అలాగే ఉంటాడో లేదంటే ఉగ్ర రూపం దాల్చుతాడో చూడాలి.