Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఆదిరెడ్డి, గీతు రాయల్ చాలా క్లోజ్ గా ఉంటూ వస్తున్నారు. ప్రతిసారి ఇద్దరి మధ్య గేమ్ గురించి చర్చ జరుగుతూనే ఎవరు..? ఎలా..? గేమ్ ఆడుతున్నారు అనేది చర్చించుకుంటూ ఉన్నారు. ప్రతి కంటెస్టెంట్ పై ఇద్దరికీ మంచి అవగాహన ఉంది. హౌస్ లో అడుగుపెట్టిన నాటి నుండి ఇద్దరు కూడా ఎవరికి వారు తమ గేమ్ స్ట్రాటజీలతో దూసుకుపోతున్నారు. గీతూ రాయల్ ఒకపక్క గొడవలు పెట్టుకుంటూనే ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కించుకుంటూ ఉంది. మరోపక్క ఆదిరెడ్డి స్ట్రాంగ్ కంటెస్టెంట్లను టార్గెట్ చేసుకుని.. వారిని రెచ్చగొట్టే రీతిలో సంభాషణ క్రియేట్ చేస్తూ ఉన్నాడు.
ఇదిలా ఉంటే శుక్రవారం జరిగిన వరస్ట్ కంటెస్టెంట్ ప్రక్రియలో హౌస్ లో దాదాపు 13 మంది గీతు రాయల్ నీ నామినేట్ చేయడం తెలిసిందే. దీంతో ఆమె జైలుకు వెళ్ళిపోయింది. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ అన్ సీన్ లో జైలులో ఉన్న గీతు రాయల్ దగ్గర ఆదిరెడ్డి డిస్కషన్ పెట్టడం జరిగింది. హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకుంటూ బాలాదిత్య గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. బాలాదిత్య ఒకపక్క గేమ్ చాలా తెలివిగా ఆడుతూనే మరోపక్క పాయింట్లు లాగేసుకుంటున్నాడు.

ఈ సీజన్ లో ఖచ్చితంగా బాలాదిత్య టాప్ 5 లో ఉంటాడని ఆదిరెడ్డి వ్యాఖ్యలకు గీతు రాయల్ కూడా ఏకీభవించింది. ఇంకా హౌస్ కి రాజశేఖర్ సెట్ కాదని.. ఇద్దరూ అన్నారు. రాజశేఖర్ మంచితనంగా ఉన్నాగాని సరైన పాయింట్లు గేమ్ పరంగా మాట్లాడలేకపోతున్నాడని చెప్పుకొచ్చారు. ఇంకా రేవంత్ రానున్న రోజుల్లో మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆదిరెడ్డి.. గీతుతో చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే సీజన్ సిక్స్ టాప్ ఫైవ్ లో బాలాదిత్యాకి బెర్త్ కన్ఫర్మ్ అని.. గీతూ రాయల్, ఆదిరెడ్డి అంచనా వేస్తున్నారు.