Bigg boss 6 ఆట ఆడకుంటేనేనా? రూల్స్ అతిక్రమించినా కూడా తాట తీస్తానని ఇవాళ బిగ్‌బాస్ చెప్పకనే చెప్పాడు.ఫుడ్ సంపాదించుకునేందుకు టాస్క్‌లు ఇస్తున్న విషయం తెలిసిందే. కదా. తొలుత విడుదల చేసిన ప్రోమోలో కబడ్డి ఆడించాడు. ఇక ఇప్పుడు విడుదల చేసిన ప్రోమోలో ఒక గేమ్ ఆడించాడు. దానిలో ఆదిరెడ్డి టీం గెలిచింది. గెలిచిన వాడు శుభ్రంగా ఫుడ్ తినేసి ఊరుకోవాలి కదా.. అలా ఊరుకోలే.. వేరొకరితో పంచుకున్నారు. ఇక బిగ్‌బాస్ ఊరుకుంటాడా? పనిష్మెంట్ కింద గిన్నెలు తోమించాడు.
అసలే కంటెస్టెంట్స్ మీద పీకల్లోతు కోపంలో ఉన్న బిగ్‌బాస్‌ను కూల్ చేసే మార్గాలు వెతకాలి కానీ వీళ్లు మరింత ఆజ్యం పోసి చోద్యం చూస్తున్నారు.దీంతో కంటెస్టెంట్లపై బిగ్‌బాస్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.అసలేం జరిగిందంటే.. బిగ్‌బాస్ హౌస్‌లోకి దొంగలను పంపించి హౌస్‌లోని ఆహారాన్ని పూర్తిగా తెప్పించుకున్నాడు. దీంతో ఇంటి సభ్యులంతా ఆకలితో అలమటించారు. దీంతో పోనీలే అని టాస్కులు పెట్టి ఫుడ్ కావాలంటే టాస్క్ గెలవాలని కండిషన్ పెట్టాడు. తొలుత కబడ్డీ.. ఆ తరువాత రివర్స్ టగ్ ఆఫ్ వార్ టాస్కులిచ్చాడు.
గెలిచిన టీమ్ సభ్యులకు ఫుడ్ లభిస్తుంది. ఈ ఫుడ్ వేరొకరితో షేర్ చేసుకోవద్దని ముందుగానే హెచ్చరించాడు బిగ్‌బాస్. అయినా వింటారా? ఇక బిగ్‌బాస్ ముద్దు బిడ్డ గీతూ ఆదేశాలేం పట్టించుకోకుండా.. గెలిచిన టీమ్ మెంబర్ అయిన ఆది రెడ్డి ప్లేటులోని ఆహారాన్ని ఏదో చిన్న పీస్ తీసుకుని తినేసింది.దీంతో బిగ్‌బాస్. ఇద్దరికీ పనిష్మెంట్ ఇచ్చాడు.బయటి నుంచి గిన్నెలు పంపించి మరీ తోమించాడు. ఇక గీతూ గిన్నెలు తోముతుంటే.. సూర్య.. ‘పెళ్లికి వేస్తారు టెంట్లు.. మా గీతక్క తోముతోంది అంట్లు’ అంటూ కామెంట్ చేశాడు. గీతూకి తన ఇంట్లో చేయి కడుక్కోవడానికి గిన్నె తీసుకుని వస్తారట. ఇవే.. ఇవే తగ్గించుకుంటే మంచిది కదా.