Goutami: 90 లలో హీరోయిన్ గౌతమి దక్షిణాది చలనచిత్ర రంగంలో టాప్ హీరోయిన్. తెలుగు అమ్మాయి అయినా గాని.. తమిళ ఇండస్ట్రీలో కూడా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. విజయ్ చందర్ .. ‘దయామయుడు’ సినిమాలో కెమియో రోల్‌తో సినీ ఎంట్రీ ఇచ్చిన గౌతమి తెలుగులో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘గాంధీనగర్ రెండో వీధి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. తమిళంలో రజినీకాంత్ ‘గురుశిష్యన్’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో టాప్ హీరోలు వెంకటేష్ ఇంక నాగార్జునతో సినిమాలు చేసిన గౌతమి చిరంజీవి, బాలకృష్ణ లతో ఒక సినిమా కూడా చేయలేదు.
కాగా డైరెక్టర్ శంకర్… యాక్షన్ కింగ్ అర్జున్‌తో తెరకెక్కించిన ‘జెంటిల్మెన్’ సినిమాలో ‘చికుబుకు రైలే’ పాటలో ఐటెం భామగా మెరిసి.. మంచి పాపులారిటీ సంపాదించింది. హీరోయిన్ గా కెరియర్ మంచి జోరు మీద ఉన్న సమయంలో 1998లో సందీప్ భాటియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి అనంతరం ఒక పాపకి కూడా జన్మనిచ్చింది. అయితే సందీప్ తో సంసారం ఎక్కువ కాలం సాగలేదు. ఏడాది అయ్యాక ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసేసుకున్నారు.
ఈ క్రమంలో పుట్టిన పాప సుబ్బులక్ష్మినీ గౌతమి తన దగ్గరే పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత గౌతమి.. విలక్షణ నటుడు కమల్ హాసన్ తో దాదాపు పది సంవత్సరాలు పాటు సహజీవనం చేశారు. తర్వాత మళ్లీ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో ఎవరికి వారు జీవిస్తున్నారు.
ఈ క్రమంలో గౌతమి… పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి కూడా అనేక ప్రయత్నాలు చేసింది. తమిళనాడు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బిజెపి పార్టీలోకి వెళ్లాలని ప్రధాని మోడీతో కూడా భేటీ అయింది. అనంతరం రాజకీయాలు వైపు వేసే అడుగులు విరమించుకొని సైలెంట్ అయిపోయింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా కూతురు సుబ్బులక్ష్మి నీ శనివారం లోకి తీసుకురావడానికి గౌతమి ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కూతురిని హీరోయిన్ గా తీసుకురావడానికి తమిళ ఇండస్ట్రీకి చెందిన కీలక దర్శకులతో మరియు నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇదే సమయంలో సుబ్బులక్ష్మి తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.