Ganesh Idol Immersion : భాగ్యనగరంలో గణనాధుడి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ తొమ్మిది రోజులు నిత్య పూజలను అందుకున్న గణపయ్యల నిమజ్జనం రేపు కన్నుల పండుగగా జరుగనుంది. నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో ఏంతో శోభాయమానంగా భారీ గణనాథులను నిమజ్జనం చేస్తారు భక్తులు. నిమజ్జనం కార్యక్రమంలో ఈ ఏడు ఎలాంటి ఆంక్షలను విధించలేదు. భారీ సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాన్ని చూసేందుకు తరలివస్తారు. దీనితో 9 వ తారీఖు అంటే శుక్రవారం నాడు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.

నిమజ్జనం సందర్భంగా రేవు ట్యాంక్ బండ్ పై జనసందోహంగా ఉంటుంది. భక్తులు వారి వారి ఇళ్ల నుంచి గణనాధులను ఊరేగింపుగా తీసుకువచ్చి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు. ఈ క్రమం లో ఎక్కడా ట్రాఫిక్ జాం లేకుండా కొన్ని ఏరియాల్లో ప్రత్యేక పార్కింగ్ ను ఏర్పాటు చేసారు. ఆ సెంటర్ లు ఏమిటో ఇప్పుడు చూద్దాము. లోయర్ ట్యాంక్ బండ్. ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, బుద్ధ భవన్, గోసేవ సదన్ లో వాహనాల పార్కింగ్ కు అనుమతి ఇస్తున్నారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు ఆయా సెంటర్ లలో వాహనాలను పార్క్ చేయాలనీ అధికారులు సుచిస్తున్నారు.

Ganesh Idol Immersion : హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది. లక్షల సంఖ్యలో భక్తులు శోభాయాత్రలో పాల్గొంటారు. మరి ముఖ్యంగా ఖైరతాబాద్ గణపయ్య శోభాయాత్రను ను చూసేందుకు చిన్న పెద్ద అందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో నగరం లో ట్రాఫిక్ జామ్ లు లేకుండా పక్క ప్లాన్ తో శోభాయాత్ర మ్యాప్ ను పోలీస్ అధికారులు విడుదల చేసారు. గణపయ్యల ఊరేగింపుకు ఒక మార్గం , మిగితా వాహనాలకు మరో మార్గాన్ని ఏర్పాటు చేసారు. పక్క రాష్ట్రాలనుంచి వచ్చే వాహనాలను శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు నగరంలోకి అనుమతించారు.
ఈరోజు రాత్రి 9 గంటల వరకే ఖరతాబాద్ గణేషుణ్ని దర్శించుకునేందుకు అనుమతి ఉంది. రేపు ఉదయం 6 గంటల నుంచి పూజలు చేసి 9 గంటలకు శోభాయాత్రను ప్రారంభిస్తారు. ఎలాంటి ఆంక్షలు లేకపోయినా త్వరగా నిమజ్జనం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మరింత సులువుగా నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. అక్కడక్కడా బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేసారు. కాబట్టి ఆ ప్రాంతాల వారు వారు ఉన్నచోటే వినాయకుల నిమజ్జనం చేయవచ్చు.