ప్రస్తుతం ఈస్ట్ ఢిల్లీకి ఎంపీగా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తనకు ఐ.ఎస్.ఐ.ఎస్ కాశ్మీర్ తీవ్రవాదుల నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తాజాగా పోలీస్ కంప్లైంట్ నమోదు చేశారు.ఆయన కంప్లైంట్ చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ అంశంపై దర్యాప్తు చేయడానికి రంగం సిద్ధం చేశారు.అలాగే ఆయన నివాసం వద్ద పోలీస్ భద్రతను పెంచారు.
ప్రస్తుతం బిజేపి సర్కార్ తీసుకున్న చర్యలతో కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులకు చుక్కలు కనిపిస్తున్నాయి వారి ఉనికి చాటుకునేందుకు తీవ్రవాదులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగంగా తీవ్రవాదులు ఆర్టికల్ 375 రద్దు అయినప్పటి నుండి ప్రభుత్వానికి అండగా నిలుస్తూ అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న గంభీర్ ను భయపెట్టే ప్రయత్నమే ఇదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.