Sudigali Sudheer : ఎంతో టాలెంట్ ఉంది. మంచి సింగర్, మెజీషియన్. అయినా కూడా ఎందుకో గానీ అనుకున్న నేమ్ మాత్రం సుడిగాలి సుధీర్‌కి రాలేదు. ఇక ఆ తరువాత జబర్దస్త్‌లోకి సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.లైఫ్‌లో అదొక అద్భుతమైన టర్న్. అదే జబర్దస్త్‌లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ నుంచి టీంను లీడ్ చేసే స్థాయికి ఎదిగాడు. తన మీదే పంచ్‌లు వేయించుకుంటూ వాటన్నింటినీ స్పోర్టివ్‌గా తీసుకుని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించాడు.ఆ తరువాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు.
వెండితెరపై తొలిసారిగా సుధీర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం..‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ . కానీ ఈ చిత్రం సుధీర్‌కు ఏమాత్రం కలిసి రాలేదు. ఆ తరువాత సుధీర్ నటించిన చిత్రం 3 మంకీస్. ఇది కూడా సుధీర్‌ు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇక ఆ తరువాత సుధీర్ హీరోగా చేసిన ముచ్చటగా మూడో సినిమా ‘గాలోడు’. ఈ చిత్రం మంచి సక్సెస్ టాక్‌నే సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సుధీర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే టాపిక్ తెగ వైరల్ అవుతోంది. గత రెండు సినిమాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు? ఈ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే దాన్ని కంపేర్ చేసి మరీ చర్చలకు దిగుతున్నారు.
గాలోడు సినిమాకు సుధీర్ రూ.40 నుంచి 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.ఇక మూడో సినిమాకే ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడంపై అతని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. నిజానికి ఓ అప్ కమింగ్ హీరోకు ఇంత భారీ రెమ్యునరేషన్ అంటే కాస్తంత షాకింగ్ అనే చెప్పాలి.పైగా తొలి రెండు చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. అయినా కూడా సుధీర్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా సుధీర్‌కి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు.