Galata Geethu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ డే వన్ మొదటి ప్రోమో రిలీజ్ అయిపోయింది. అనుకున్నట్టుగానే హౌస్ లో గొడవలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. గీతు రాయల్ తోటి కంటెస్టెంట్స్ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. బాత్రూంలో జుట్టు ఎవరిదో ఉందని..గీతు రాయల్ ఇష్టానుసారంగా తోటి కంటెస్టెంట్లపై నోరు పారేసుకుంది. ఆమెకు దీటుగానే మిగతా వాళ్ళు కూడా ప్రోమో లో కౌంటర్ లు ఇస్తున్నారు. గీత రాయల్.. బాత్రూం గొడవ.. ఎంట్రీ ఇచ్చిన తర్వాత రోజు ఎపిసోడ్ ప్రోమోలో హైలెట్ గా చూపిస్తున్నారు. ఇక ఇదే సమయంలో హౌస్ లో ఉన్న 21 మంది సభ్యులను మూడు గ్రూపులుగా ఉండే రీతిలో బిగ్ బాస్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ విషయాన్ని హాల్లో అందర్నీ కూర్చోబెట్టి ఫైమా చేత చెప్పించడం జరిగింది. ఆ మూడు గ్రూపులు.. మొదటి గ్రూపు సకల సౌకర్యాలు బిగ్ బాస్ హౌస్ లో అనుభవించే వాళ్ళు. ఇక రెండో గ్రూప్ కి చెందిన వాళ్లు వీరు వీళ్ళ భోజనం గార్డెన్ ఏరియాలో వండుకుని తినేవాళ్లు. మూడో గ్రూప్ గురించి చెప్పకుండా సస్పెన్స్ పెట్టారు. అనంతరం… బిగ్ బాస్ హౌస్ లో ఈ మొదటి టాస్క్ గురించి.. ఇంటి సభ్యులంతా ఎవరికి వారు తమ అభిప్రాయాలు తెలియజేశారు.
Galata Geethu:
మొత్తం మీద చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో గొడవలకి అడ్డా అన్న తరహాలో మొదటి రోజు వాతావరణం ప్రోమోలో కనిపిస్తుంది. ఫస్ట్ టాస్క్ కే ఈ రకంగా గొడవలు జరిగితే ఇంకా డ్యూటీలు వేసుకునే విషయంలో ఇంకెన్ని గొడవలు జరుగుతాయో చూడాలి. ఏది ఏమైనా హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత రోజే కంటెస్టెంట్ గీతు రాయల్.. హౌస్ లో రచ్చ చేసినట్లు ప్రోమో తెలుస్తుంది.