Galata Geethu తెలుగు బిగ్ బాస్ సీజన్ 6లో తనదైన యాస, ఆటతో అందరినీ ఆకట్టుకున్న కంటెస్టెంట్ గీతూ రాయల్. ఇన్ స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకున్న గీతూ.. ఆ తర్వాత మెల్లిగా జబర్దస్త్ లో స్థానం సంపాదించుకుంది. అక్కడ కూడా ఆమె ఎంతో అద్భుతంగా రాణించడంతో అంతకంతకు మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ తరుణంలోనే గీతూ రాయల్ కి తెలుగు బిగ్ బాస్ లో అవకాశం లభించింది.
బిగ్ బాస్ సీజన్ 6లో అవకాశం కొట్టేసిన గీతూ రాయల్.. ప్రారంభంలో ఎంతో అద్భుతంగా ఆడింది. అసలు బలమైన కంటెస్టెంట్ అంటే ఎలా ఉండాలో గీతూని చూసి నేర్చుకోవాలని అందరూ అనుకునేలా ఆమె అద్భుతంగా రాణించింది. అయితే ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేసులో గీతూ పేరు ఖచ్చితంగా ఉంటుందన్న తరుణంలోనే గీతూ.. అతిగా ప్రవర్తించడం అందరికీ విసుగు తెప్పించింది. దీంతో ఆమెను బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ చేయాలనే డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ఆమె ఓట్లు తక్కువ వచ్చిన కారణంగా బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చేసింది.
తాజాగా గీతూ రాయల్ కు అదిరిపోయే ఆఫర్ ఒకటి వచ్చినట్లు వస్తున్న వార్తలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఒకవేళ ఆ వార్తలు నిజమే అయితే మాత్రం గీతూ దశ తిరిగినట్లే అని అందరూ చర్చించుకుంటన్నారు. ఇంతకీ అంతా గీతూకి వచ్చని అదృష్టం ఏంటని అనుకుంటున్నారా? ఆమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. పవన్, హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో ఓ మంచి రోల్ వచ్చినట్లు తెలుస్తోంది.
Galata Geethu
పవన్ కళ్యాణ్ సినిమాలో రోల్ చేయడం అంటే గీతూకి అదృష్టం తలుపుతట్టినట్లే అని అందరూ చర్చించుకుంటున్నారు. చిత్తూరు యాసతో అందరిలోకి ఎంతో గుర్తింపును తెచ్చుకునే గీతూకి.. పవన్ సినిమాలో ఖచ్చితంగా మంచి గుర్తింపు లభిస్తుందని అందరూ అనుకుంటున్నారు. గీతూ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో బాగా యాక్టివ్ గా ఉంటుందని జనాలు గుసగుసలాడుతున్నారు.