Gajuwaka Conductor: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీలుగా మారిపోయారు.సోషల్ మీడియా వేదికగా వారిలో ఉన్నటువంటి టాలెంట్ బయట పెడుతూ ఎన్నో వీడియోలను చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా వారిని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.ఇలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలుగా మారిన వారు ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రస్తుతం బిజీగా గడుపుతున్నారు.
ఇలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలుగా మారిన వారిలో గాజువాక బస్సు కండక్టర్ ఝాన్సీ ఒకరు.ఈమె అద్భుతమైన డాన్స్ లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మల్లెమాలవారు ఈమె టాలెంట్ ను గుర్తించి తనకు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో అవకాశం కల్పించారు.ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం పై పల్సర్ బండి అనే పాట ద్వారా మాస్ పర్ఫామెన్స్ చేసిన ఈమెకు విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు.
ఇలా ఈ పాటతో ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమెకు పలు కార్యక్రమాలకు ఆహ్వానించడమే కాకుండా ఎన్నో ఇంటర్వ్యూలలో హాజరవుతూ సెలబ్రిటీగా మారిపోయారు. ఝాన్సీ బుల్లితెర కార్యక్రమాల ద్వారా సందడి చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఈమెకు వెండితెరపై నటించే అవకాశం కూడా వచ్చినట్టు తెలుస్తుంది.
Gajuwaka Conductor: హీరో ఫ్యాక్టర్ కురిపిస్తున్న నెటిజన్స్..
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్నటువంటి తన తదుపరి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసే అవకాశాన్ని ఈమెకు కల్పించారని సమాచారం.తన సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం కోసం సంపూర్ణేష్ బాబు స్వయంగా ఝాన్సీకి ఫోన్ చేసి తన సినిమాలో చేయాలని కోరారుట. ఇలా ఏకంగా హీరోనే తనకు ఫోన్ చేసి సినిమా అవకాశం ఇవ్వడంతో ఈమె ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ పాటకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. ఇకపోతే సంపూర్ణేష్ బాబు ఇలా తనలో ఉన్న టాలెంట్ చూసి తనకు వెండితెర అవకాశం ఇవ్వడంతో పలువురు హీరో పై ప్రశంసలు కురిపిస్తున్నారు.