TCS : బిజినెస్ అంటే చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. అయితే ఒక్కసారి క్లిక్ అయ్యామా.. తిరిగి చూసుకోనక్కర్లేదు. కానీ రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేసి.. అది కూడా నెలకు కొన్ని రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేసి రూ.15 లక్షలు సంపాదించవచ్చా? అంటే వై నాట్ అంటోంది స్టాక్ మార్కెట్. అవును మరి ఇక్కడ కిటుకు తెలిస్తే డబ్బు అలా వచ్చి పడుతుంది. అది కూడా ఒకేసారి లక్షలు ఇన్వెస్ట్ చేయనక్కర్లేదు. నెల నెలా ఒక్కో షేర్ చొప్పున కొంటే చాలు. మనం ఊహించనంత డబ్బు మన సొంతమవుతుంది.
TCS : ఐటీ సెక్టార్‌లో నంబర్ 1 కంపెనీ..
దాహరణకు ఈక్విటీ మార్కెట్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) గురించి తెలుసుకుందాం. మన డబ్బును రూ.15 ఏళ్ల పాటు ఎస్‌ఐపీ మోడ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. టీసీఎస్‌కు నిఫ్టీలో రెండవ పొజిషన్ ఉంది. ఐటీ సెక్టార్‌లో నంబర్ 1 కంపెనీ ఇది. మరి దీనిలో ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బు ఎలా టర్న్ అవుతుందో చూద్దాం. సీఎస్‌లో 5 జనవరి 2007 నుంచి 5 డిసెంబర్ 2021 వరకూ 15 సంవత్సరాల పాటు నెలకు కేవలం ఒకే ఒక్క షేర్ చొప్పున కొనుగోలు చేయాలి. 15 ఏళ్లకు మనం కొనుగోలు చేసిన షేర్ల సంఖ్య 180కు చేరుకుంటుంది.

ఇక అదనంగా రెండు సార్లు టీసీఎస్ తమ షేర్లను స్ప్లిట్ చేసింది. ఈ రెండు సార్ల స్ప్లిట్ ఒకటి 16 జూన్ 2009న మరొకటి 31 మే 2018న జరిగింది. 1:2 నిష్పత్తిలో స్టాక్ స్ప్లిట్ జరిగింది. ఇలా 180 షేర్లు డబుల్ అయ్యాయి. ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ వచ్చేసి రూ.3,28,000 అయ్యింది. 25 జనవరి 2022కు 377 షేర్లు 30770తో మల్టిప్లై చేస్తే రూ.14 లక్షల 21 వేల 290 రూపాయలు అయ్యింది. దీనికి డివిడెండ్ ఇన్‌కం కూడా యాడ్ అవుతుంది. అంటే మొత్తం కలిపి 15 లక్షలు పై మాటే. కేవలం రూ.3 లక్షల ఇన్వెస్ట్‌మెంట్ అది కూడా ఒకేసారి పెట్టింది కాదు. నెల నెలా మనం కొంత జమ చేసుకున్నదన్న మాట. ఇలా టీసీఎస్‌లో నెలకు ఒక్క షేర్ కొంటే చాలు. మనకు తెలియకుండానే లక్షాధికారులం అయిపోతాం.