Fruits: మారుతున్న జీవన శైలి ప్రకారం మనుషుల్లో ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఇలా ఏది పడితే అది తినడం వల్ల రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు షుగర్ బీపీ అంటే కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే అప్పటి ఆహారపు అలవాట్లు అలాంటివి. మరో విషయం ఏమిటంటే సేంద్రియ ఎరువులతో పంటను పండించేవారు. కానీ ఇప్పుడు పంట త్వరగా రావడానికి రకరకాల మందులను వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చిన్న వయసులోనే అనారోగ్యానికి లోనవుతున్నారు.
ఇక అప్పట్లో షుగర్ ఒక వయసులో ఉన్న వారికే వచ్చేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఎవరికి పడితే వాళ్లకి వస్తుంది. ఇలా షుగర్ వచ్చిన పేషేంట్స్ ఎప్పటికి జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. అలా తీసుకోకపోతే సమస్యలు తప్పవు. అయితే షుగర్ వచ్చిన వారు కొన్ని పండ్లని తీసుకోకుండా నోటికి తాళం వేసుకోవడం ముఖ్యం. కానీ ఈ పండ్లు షుగర్ పేషేంట్స్ తీసుకుంటే మాత్రం చాలా మంచిది. అవేమిటో తెలుసుకుందాం.
నారింజ పండ్లు షుగర్ పేషేంట్స్ కి ఒక వరం. ఎందుకంటే ఈ పండ్లలో చక్కర శాతం చాలా తక్కువ ఉంటుంది. నారింజలో విటమిన్ సి,పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇక మరో ఫ్రూట్ ఏమిటంటే పీచ్ ఫ్రూట్. ఇందులో పీచ్ ఉంటుంది. ఇది కూడా షుగర్ లెవల్స్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పండులో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
Fruits:
షుగర్ లెవెల్స్ ని తగ్గించే మరో ఫ్రూట్ కివి ఫ్రూట్. ఈ పండులో కూడా ఫైబర్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. భేరి పండు కూడా షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. ఇందులో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు పూర్తి శరీరానికి మేలు చేస్తుంది.