ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడుగా రాజమౌళి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా కూడా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఇలా రాజమౌళి ఫేమ్ ప్రస్తుతం ఇండియాలో ఆకాశమంత ఎత్తులో ఉందని చెప్పాలి. అతని మానియాని ఇప్పట్లో ఎవరూ అందుకోలేరు. బాలీవుడ్ దర్శకులు సైతం రాజమౌళి రికార్డులని బీట్ చేయాలని, సౌత్ సినిమా ఆధిపత్యాన్ని తగ్గించాలని చూస్తున్నారు. అయితే జక్కన్న స్ఫూర్తితో మన దర్శకులు ఇండియన్ వైడ్ గా తన స్టామినా చూపిస్తున్నారు. ప్రశాంత్ నీల్, సుకుమార్, చందూ మొండేటి, హను రాఘవపూడి ఇప్పుడు బాలీవుడ్ సినీ ప్రేక్షకులకి కూడా బాగా చేరువ అయిపోయిన దర్శకులు.
ఒకప్పుడు సౌత్ సినిమా అంటే చాలా తక్కువగా చూసే బిటౌన్ సెలబ్రెటీలు అందరూ తెలుగులో నటించాలని కోరుకుంటున్నారు. అదంతా కేవలం రాజమౌళి క్రియేట్ చేసిన ఫేమ్ అని చెప్పాలి. ఇక ఇండియన్ దర్శకులకి విదేశాలలో అస్సలు గుర్తింపు కూడా ఉండదు. హాలీవుడ్ సినిమాలని ఆదరించే అక్కడి ప్రేక్షకులకి ఇండియన్ సినిమాపై అంత ఆసక్తి ఉండదు కూడా. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ఆ ఇమేజ్ ని కూడా మార్చేసింది. హాలీవుడ్ టెక్నీషియన్స్, యాక్టర్స్ సైతం ఆర్ఆర్ఆర్ మేకింగ్ విజన్ పై ప్రశంసలు కురిపించారు.
ఇదిలా ఉంటే అమెరికాలో ప్రముఖ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆర్ఆర్ఆర్ సినిమా స్క్రీనింగ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఆ ఫెస్టివల్ లో రాజమౌళి విజన్ ని వందలాది మాది ముందు తెలియజేశారు. ఆ షోలో పార్టిసిపేట్ చేసిన రాజమౌళితో ఆటోగ్రాఫ్స్, ఫోటోలు తీసుకోవడానికి విదేశీయులు ఎగబడ్డారు. ఆటోగ్రాఫ్స్ కల్చర్ ఎప్పుడో అంతరించిపోయిన ఓ విదేశీయుడు రాజమౌళి నుంచి ఆటోగ్రాఫ్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబందించిన ఫోటోని ఆర్ఆర్ఆర్ టీం ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విదేశీ నటులు, దర్శకులని గొప్పగా చూసే రోజుల నుంచి మనవాళ్ళ దగ్గర ఫోటోలు, ఆటోగ్రాఫ్స్ తీసుకునే స్టేజ్ ని రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని తీసుకెళ్లాడని గొప్పగా ప్రశంసిస్తున్నారు.