ఈ మధ్యకాలంలో ఇండియన్ సినిమాలలో ఫారిన్ భామల జోరు ఎక్కువ అయ్యింది. అమీ జాక్సన్ మొదటిగా ఇంగ్లాండ్ నేటివ్ నుంచి కోలీవుడ్ సినిమాలో అడుగుపెట్టింది. ఆ తరువాత తెలుగు, హిందీ భాషలలో కూడా ఈమె చాలా సినిమాలు చేసింది. శంకర్ ఐ సినిమాలో బాగాపాపులర్ అయ్యింది. అదే దారిలో చాలా మంది ఫారిన్ముద్దుగుమ్మ లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రీసెంట్ గా శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమాలో ఉక్రెయిన్ భామ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు సౌత్ ఇండియా టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ సినిమాలో ఒక ఫారిన్ భామ టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న సత్యదేవ్ గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి ప్రతినాయకుడిగా నటించి మెప్పించాడు.
ఈ సినిమాలో చిరంజీవితో సమానమైన ప్రశంసలు సత్యదేవ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సత్యదేవ్ తమన్నాతో కలిసి నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. మరో వైపు తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కబోయే మల్టీ స్టారర్ మూవీలో సత్యదేవ్ నటిస్తున్నాడు. ఈ మూవీలో సత్యదేవ్ తో పాటు కన్నడ స్టార్ ధనుంజయ్ కూడా మరో హీరోగా కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. అందులో ఒక హీరోయిన్ గా ఇప్పటికే ప్రియా భవాని శంకర్ ఫైనల్ అయ్యింది.
ఇక ఈ మూవీలో మరో హీరోయిన్ గా బ్రెజిల్ మోడల్ జెన్నిఫర్ పిచినెటో ఎంపిక అయ్యింది. ఈమె అక్షయ్ కుమార్ రామ్ సేతు సినిమా ద్వారాలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ లోకి నటిగా అడుగుపెట్టింది. ఆ మూవీలో సత్యదేవ్ కూడా కీలక పాత్రలో నటించాడు. అక్కడ ఏర్పడిన పరిచయంతో తన కొత్త సినిమా కోసం జెన్నిఫర్ ని సత్యదేవ్ రిఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పీరియాడిక్ జోనర్ లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఆవిష్కరిస్తున్నారు. ఇక ఈ మూవీ కోసం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా ఒక సెట్ వేశారు. ఇందులో త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.