ఇండియాలో మూవీ స్టార్స్ కుండే క్రేజ్ మరెవరికీ ఉండదు అందుకే ఈ గ్లామర్ ఫీల్డ్ లోకి రావడానికి,ఇందులో ఉన్నవారి గురించి తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతుంటారు.ఇండస్ట్రీలో చాలావరకు అందరికీ షార్ట్ కెరియర్ లు ఉంటాయి అందుకే ఇండస్ట్రీ వారు లైమ్ లైట్ లు ఉన్నప్పుడే కావల్సినంత సంపాదించుకోవాలనుకుంటారు.ఇక ఈ లైమ్ లైట్ స్టార్స్ ను క్యాష్ చేసుకోవాలని కార్పొరేట్ యాజమాన్యాలు ఫీల్ అవుతుంటాయి.తాజాగా ఇలా ఫీల్ అయిన ఒక బడా ఓటిటి సంస్థ బాలీవుడ్ చూపును తమ వైపు తిప్పుకున్న కత్రినా,విక్కి కౌషల్ ను సంప్రదించిందట వారి వివాహాన్ని తమ ప్లాట్ ఫారంలో లైవ్ ఇవ్వడానికి వంద కోట్లు ఆఫర్ చేసిందట అని ప్రచారం జరుగుతుంది.మరి ఈ ఆఫర్ ను ఈ కపుల్ అంగీకరించారా లేదా అనేది తెలియాలంటే ఈ నెల 9న రాజస్థాన్ లో జరగనున్న వీరి పెళ్లి దాకా ఆగాల్సి ఉంటుంది.