గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీగా పాపులారిటీ దక్కించుకొని ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్స్ శ్రీ లీల ఒకటే అనే చెప్పాలి. ఎంతోమంది కుర్ర హీరోలకి కాదు సీనియర్ హీరోలకి కూడా ఏకైక ఆప్షన్ అన్నట్టుగా మారిపోయింది. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అది తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీ దక్కించుకున్న ఈమె స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు నటించి విడుదల చేసింది రెండు సినిమాలే అయినా భారీగా పాపులారిటీ దక్కించుకున్న ఈమె చేతిలో ఇంకా పదికి పైగా సినిమాలు ఉండడం గమనార్హం.

ఒకదానికి మించి మరొకటి సినిమాలలో ఈమెకు అవకాశాలు లభిస్తున్నాయి. వాటిలో ఎక్కువగా సీనియర్ స్టార్ హీరోల సినిమాలే ఉండడం గమనార్హం. ఇప్పటికే బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా ఇదే ఏడాది దసరా పండగ సందర్భం లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఓ జి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కాబోతోంది.
ఇది ఇలా ఉండగా ఈ.. మధ్య వరుసగా టాలీవుడ్ లో ఉన్న సీనియర్ స్టార్ హీరోల సినిమాలలోనే ఎక్కువగా నటిస్తోంది. మరోపక్క యంగ్ హీరోస్ కంటే సీనియర్ హీరోలతోనే సినిమాలు చేయడానికి ఎక్కువ గా ఆసక్తి చూపిస్తుండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యనికి గురి అవుతున్నారు .
అయితే ఇలా సీనియర్ హీరోలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం ఆ హీరోలకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు ఎలాంటి సినిమా తీసినా హిట్టు కొట్టించడానికి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారని అలా తన ఖాతాలో కూడా హిట్లు పడతాయని అన్నారు . ఇదే మెయిన్ రీజన్ గా ఆమె ఎక్కువగా సీనియర్ హీరోలకు మాత్రమే అవకాశాలు ఇస్తుందని అన్నారు . ఏమైనా ఈమె సినిమా ప్లాన్ నిజంగా అద్భుతం అని ప్రతి ఒక్కరు ఆమె ని పొగుడుతున్నారు.