Food Tips: ఏమిటో కొంత మందికి అయితే ఎప్పుడు నోట్లో ఏదో ఒకటి నానుతూనే ఉంటుంది. ఎలా తింటారంటే అసలు ఎప్పుడు తిండి మొహమే ఎరుగరు అన్నట్టు తింటారు. అంతెందుకు అండి, ఇలాంటి వారు మన స్నేహితులలోనే ఉంటారు. ఎప్పటికీ తింటూనే ఉంటారు. కాని వారి శరీరాకృతిలో మాత్రం అసలు మార్పే కనిపించదు. ఇలా మనకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అలా ఎలా కుదురుతుంది. అప్పుడప్పుడు వాళ్ళని చూస్తే ఈర్ష్య పుడుతుంది. ఏంటబ్బా అసలు వీళ్ళు వ్యాయామం కూడా సరిగ్గా చేయరు ఇంత సన్నగా ఎలా ఉంటారు? ఆ వివరాలని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
నిజం చెప్పాలంటే మన ముందు చాలా తిన్నట్టు కనిపిస్తారు. కానీ మన ముందు ఎన్ని చిరు తిండ్లు తిన్నా వారు ఆహారం విషయం లో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే వారు రోజులో కేవలం రెండు సార్లే తినడం వల్ల వాళ్ళలో క్యాలారీలు సమతుల్యంగా ఉంటాయి. ఇది కూడా ఒక కారణం కావొచ్చు.
ఇంకో విషయం ఏంటంటే వారి శారీరక శ్రమ పైన కూడా ఆధారపడి ఉంటుంది. మనం వ్యాయమశాలలో ఎంత కష్ట పడినా సరి అయిన శారీరక శ్రమ లేకపోతే వ్యర్ధం. అలా వారు రోజంతా ఎక్కువ కష్టపడిన వారు ఎక్కువ తినడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇది మన పూర్వీకుల్లో కూడా చూసే ఉంటాం. అప్పట్లో రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపదేవారు. కానీ ఇప్పుడు కాలు కదిపి అడుగు బయట పెట్టడానికి బద్ధకమైపోయింది.
Food Tips:
పరిశోధనల ఆధారంగా తెలిసిన విషయం ఏమిటంటే సన్నగా ఉండడానికి కారణం వారి జన్యువుల పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇలాగె బరువు పెరగడానికైనా, తగ్గదానికైనా జన్యు శాస్త్రం పాత్ర తప్పనిసరిగా ఉంటుంది.