Food for blood: ఆరోగ్యాన్ని మించిన ధనం లేదు. ఆరోగ్యవంతుడ్ని అదృష్టవంతుడు అని కూడా అంటారు. మారుతున్న జీవనప్రమాణాల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఇటీవల రక్తహీనత సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతుంది. రక్తహీనత అంటే రక్తంలో ఉండాల్సిన దానికంటే హిమోగ్లోబిన్ స్థాయిలు చాలా తక్కువగా ఉండటం. ఈ పరిస్థితి లక్షణాలు ఏంటంటే ఎప్పుడూ అలసటగా ఉండటం, శక్తి తక్కువగా ఉండటం, మగత.
వయసుతో సంబంధం లేకుండా చాలామందే ఈ పరిస్థితితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఐరన్ లోపం వల్లే రక్తహీనత కలుగుతుంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఐరన్ హెచ్చుగా ఉండే ఆహారం తీసుకోవడమే శరణ్యం. ఐరన్ ఎక్కువగా పదార్ధాలు చాలానే ఉన్నాయి. పళ్ళు,ఆకుకూరలు,కూరగాయలు ఇలా చాలానే ఉన్నాయి. అలాంటి కొన్ని పదార్ధాలను చూద్దాం.
ఆకు కూరలలో పోషకాలు ఎన్నో. వీటిని తరచుగా తీసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయి పెరగడమే కాకుండా,ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఈ సమస్య ఉన్నవారే కాదు,అందరూ ఆకు కూరలు తినాలి. బ్రోకలీ, బచ్చలికూర,పాల కూర,తోటకూర వంటి ఆకు కూరలు తరచుగా తీసుకుంటూ ఉండాలి.
ఇక పళ్ళ విషయానికొస్తే విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మకాయలు,ఉసిరికాయలు,నారింజ తినడం ద్వారా రక్తహీనతని ఎదురుకోగలం. ఈ పళ్ళల్లో విటమిన్ సి మంచి స్థాయిలలో ఉంటాయి. ఇవి రక్తహీనతని తగ్గించడానికి ఉపయోగపడతాయి.
Food for blood:
ఇవే కాకూండా దానిమ్మ,ఖర్జూరాలు,బొప్పాయి కూడా మంచివే. ఈ పరిస్థితితో ఇబ్బంది పడేవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. రక్తం స్థాయి పెంచడమే కాదు,రోగనిరోధక శక్తిని పెంచడం కూడా ముఖ్యమే. అందుకని ఈ పదార్ధాలని రోజూ తీసుకునేలా చూసుకోవాలి.బీట్ రూట్ ఒక దివ్యౌషధం లా పనిచేస్తుంది. బీట్ రూట్ చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు కానీ ఇది ఎన్నో అద్భుతాలు చేయగలదు. ఐరన్ కంటెంట్ తో పాటుగా,బీట్ రూట్ లో పొటాషియం,ఫోలిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి.