ఇంటర్నెట్ ను ఎక్కువగా వినియోగించే దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉంది.దీన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రతి ఏటా ఈ కామర్స్ దిగ్గజాలు బిగ్ బిలియన్ డేస్ ను నిర్వహిస్తాయి.ఈ బిగ్ బిలియన్ డేస్ లో కావాల్సిన ప్రొడక్ట్ లు బయట కంటే తక్కువ ధరకే ఆన్ లైన్ లో దొరుకుతుండడంతో ప్రజలు ఆన్ లైన్ షాపింగ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
అందుకే ఈసారి జరిగిన బిగ్ బిలియన్ డేస్ లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ సుమారు 11,500 కోట్ల రూపాయిలను అదా చేసుకుంది.ఈ విషయాన్ని ఫ్లిప్ కార్ట్ ట్విట్టర్ వేదికగా తమ కస్టమర్స్ తో పంచుకుంది.ఈసారి ఫ్లిప్ కార్ట్ లో 50 లక్షల కప్పుల టీ తాగేంత విలువైన టీ పౌడర్ సేల్ జరిగిందని అలాగే ఈసారి అమ్ముడైన ఫోన్ లు ఒకదాని పై ఒకటి పెట్టుకుంటూ వెళ్తే సుమారు 1000 బుర్జ్ ఖలీఫాలకు సమానం అవుతుందని ప్రకటించింది.
Thank you India 🙏🏼#BigBillionDays pic.twitter.com/MyqEQuILKO
— Flipkart (@Flipkart) October 10, 2021