1932లో జేఆర్‌డీ టాటా ‘ టాటా ఎయిర్‌లైన్స్ ‘ ను ప్రారంభించారు.ఈ ఎయిర్‌లైన్స్ లో మొదటి విమానాన్ని జేఆర్‌డీ టాటా గారే స్వయంగా కరాచీ నుంచి నడిపారు ఈయనకు ప్రొఫెషనల్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది.అప్పట్లో లాభాలలో నడుస్తున్న ఈ సంస్థను 1953 లో ఇందిరా గాంధీ ప్రభుత్వం జాతీయం చేసింది.అప్పటి నుండి ఈ సంస్థ నష్టాల బాట పట్టింది.దీంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియా కోసం ఓపెన్ బిడ్డింగ్ ప్రక్రియ పెట్టింది.
ఇందులో టాటాలు 18వేల కోట్లతో ఈ సంస్థను దక్కించుకున్నారు.ప్రస్తుతం నష్టాలలో నడుస్తున్న ఎయిర్ ఇండియా సంస్థను టాటాలు మళ్ళీ లాభాల బాట ఎక్కించగలరో లేదో వేచి చూడాల్సివుంది.ఇక ఈ సంస్థ ప్రారంభమైన మొదట్లో ముంబై నుండి హైదరాబాదుకు టికెట్ ధర 80 రూపాయిలు ఉండేదన్న విషయం తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.