Rules of Money Control: ప్రస్తుత రోజుల్లో డబ్బులు సంపాదించడం పెద్ద విషయం కాదు. ఆన్ లైన్ విధానం ద్వారా అనేక రీతులుగా డబ్బులు సంపాదించుకునే మార్గాలు బయట కనిపిస్తూ ఉన్నాయి. కానీ సంపాదించిన డబ్బు ఎంతవరకు..? ఆదా చేస్తున్నాం ఎలా ఖర్చుపెడుతున్నాం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఎంత ధనవంతుడైన సరే.. నెలాఖరు వచ్చేసరికి చేతులు చాపే పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బు విషయంలో సరైన అవగాహన ముందుచూపుతో వ్యవహరిస్తే.. ఉన్న సొమ్ముతోనే సొంత కాళ్ళపై నిలబడి ఎవరి దగ్గర కూడా.. చేయి చాపే పరిస్థితులు ఉండవు. ఈ క్రమంలో డబ్బును ఆదా చేసే ఐదు తిరుగులేని అలవాట్లు గురించి టెక్ ఫిన్ సంస్థ డెసిమల్ వ్యవస్థాపకుడు సీఈవో సత్యజిత్ కున్ జిర్ వెల్లడించడం జరిగింది. ఈ అలవాట్లను యుక్త వయసులోనే అలవర్చుకుంటే మెరుగైన ఆర్థిక జీవితం ఉంటుందని సూచించారు. ఆ ఐదు అలవాట్లు ఏమిటంటే.
1)ఆర్థికపరంగా ముందుగానే లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. వాటికి కాలం పరిమితులను నిర్ణయించుకుని.. పక్క ప్లానింగ్ చేసుకోవాలి. ముందస్తుగానే లక్ష్యాలను సిద్ధం చేసుకుని నిర్ణీత కాలంలో.. వాటిని ఛేదించాలి. ఇక నెలవారి ఖర్చులకు సంబంధించి ముందుగానే బడ్జెట్ రూపొందించుకోవాలి.
2)కష్టం అనిపించినా గానీ బడ్జెట్ పరిమితి దాటకుండా లక్ష్యాలను సాధించుకోవాలి.
3)ఇక ఖచ్చితంగా సకాలంలో బిల్లులు చెల్లించాల్సినవి ముందుగానే చెల్లించాలి. ఆ తర్వాత మిగిలిన డబ్బులు ఎంత వరకు సేవింగ్ చేయగల మన అంశంపై ఒక క్లారిటీ వస్తుంది. ఉన్న డబ్బును ఏవిధంగా ఖర్చు చేయాలనేది కూడా స్పష్టత ఉంటుంది.
4)ఇక డబ్బును ఆదా చేసుకునే విషయంలో ఇంటర్నెట్ లో సమాచారాన్ని సేకరించి పక్క ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
5)ఇంకా పెట్టుబడులు వంటి వాటిపై అవగాహన ఉంటేనే అడుగు పెట్టాలి. ఎటువంటి పరిస్థితినైనా టేక్ అప్ చేయగలిగే అవగాహన ఉంటే పెట్టుబడి పెట్టొచ్చు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగానే పెట్టుబడులు విషయంలో ముందడుగు వేయాలి. అన్ని విషయాలు సమీక్షించుకొని పెట్టుబడులు పెట్టడంలో నిర్ణయం తీసుకోవడం ముఖ్యం.