Adipurush First Review : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నుంచి కొత్త సినిమా వస్తుందంటే అభిమానులే కాదు యావత్ ప్రపంచంలో ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. మరీ ముఖ్యంగా చైనా, జపాన్, మలేషియా దేశాలలో అయితే, వారి పనులు మానుకొని మరీ ప్రభాస్ సినిమా కోసం థియేటర్స్ కి పరిగెడతారు. ఇండియాలో అభిమానుల మాదిరిగా ప్రతీ సినిమాకీ ప్రభాస్ గెటప్ ని టాటూగా ఒంటిమీద వేసుకుంటారు.
అదీ ప్రభాస్ కి బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన క్రేజ్. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలకీ ఇదే క్రేజ్. అయితే, ఈ రెండు సినిమాలు బాగా డిసప్పాయింట్ చేశాయి. అయినా తాజాగా థియేటర్స్‌లో వచ్చిన ఆదిపురుష్ సినిమాపై గతకొన్ని రోజుల నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను తారా స్థాయిలో అందుకుంది. తాజాగా యూఎస్ తో పాటు చైనా జపాన్ లాంటి విదేశాలలో రిలీజైన ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
Adipurush First Review : ప్రభాస్ కెరీర్‌లో ఓ అద్భుతమైన విజువల్ వండర్ అంటున్నారు.
ఇప్పటికే ట్రేడ్ వర్గాలు బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాల రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం అంటున్నాయి. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో రాముడిగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ పక్కా కమర్షియల్ సినిమాలు చేసిన డార్లింగ్, మొదటి సారి రామాయణ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఆదిపురుష్ సినిమాలో రాముడిగా కనిపించాడు. ప్రభాస్ కెరీర్‌లో ఓ అద్భుతమైన విజువల్ వండర్ అంటున్నారు.
ఈ సినిమా ప్రీమియర్ షోస్ ఇప్పటికే విదేశాలలో పడ్డాయి. ఆ షోస్ చూసిన ప్రేక్షకులు సినిమా అద్భుతంగా ఉందని, ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమని అంటున్నారు. సోషల్ మీడియాలో అప్పుడే రివ్యూలు మొదలయ్యాయి. ఎక్కడ కూడా ఆదిపురుష్ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ రావడం ప్రభాస్ అభిమానులను, చిత్ర యూనిట్ ని ఆనందంలో ముంచేస్తుంది. ఇక మన ఇండియాలో.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆదిపురుష్ స్పెషల్ షో రేపు ఉదయం తెల్లవారు జామున 4గం నుంచే ప్రారంభం కానున్నాయి. బుక్ మై షోలో మూడురోజుల పాటు అన్నీ థియేటర్స్ హౌజ్ ఫుల్ అయ్యాయి. చూడాలి మరి ఈ సినిమా ఫైనల్ రన్ లో ఎన్ని సరికొత్త రికార్డ్స్ నమోదు చేస్తుందో