Bigg boss 6 : బిగ్‌బాస్-6లో కాస్త యాక్టివ్ కంటెస్టెంట్స్‌లో ఫైమా ఒకరు. ప్రస్తుతం ఆమె కెరీర్ అయితే బిగ్‌బాస్‌కు ముందు తరువాత అన్నట్టుగా ఉంది. హీరోని జీరో.. జీరోని హీరో చేయగల సత్తా బిగ్‌బాస్‌కి ఉంది. ఇప్పటి వరకూ ఫైమాలోని కామెడీ యాంగిల్‌ని మాత్రమే చూసిన ప్రేక్షకులు ఇప్పుడు మరో యాంగిల్‌ను కూడా చూస్తున్నారు. ఇక బిగ్‌బాస్ ఆమె కెరీర్‌కు ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనేది ఇప్పుడే చెప్పలేం. తాజాగా ఫైమా మాట్లాడుతున్న మాటలు ప్రేక్షకులకు అస్సలు నచ్చడం లేదు. చిరాకు తెప్పిస్తున్నాయి.
అయితే ఫైమాకు బిగ్‌బాస్ ఆఫర్ రావడం వెనుక చాలా కష్టం ఉంది. తొలుత ఫైమా ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారమైన ‘పటాస్’ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఫైమాకు పటాస్ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదట. కానీ ఫైమా మాత్రం పట్టు వదల్లేదట. చస్తా అని బెదిరించి మరీ ఇండస్ట్రీలోకి వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా ఫైమా తల్లే చెప్పింది. తనకు నలుగురు ఆడపిల్లలని.. వారిలో ఫైమా చిన్నదని.. కూలి పనులు చేసుకుంటూ బతికేవాళ్లమని ఫైమా తల్లి వెల్లడించింది. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదట.
ఫైమా చిన్నప్పటి నుంచి చాలా మొండదని ఆమె తల్లి వెల్లడించింది. కాలేజీ చదివే రోజుల్లో ఫ్రెండ్స్‌తో కలిసి పటాస్ షోకి ఆడియన్‌గా వెళ్లిందట. అక్కడ స్టేజ్ మీదకు వెళ్లేందుకు గట్టిగా అరవడంతో పటాస్ డైరెక్టర్ దృష్టిలో పడిందట. దీంతో ఆమెను పటాస్ షోకి ఆహ్వానించారని కానీ దానికి తాము ఒప్పుకోలేదని.. ఆ సమయంలోకి గదిలోకి వెళ్లి పటాస్‌కి పంపకుంటే చస్తానని బెదిరించిందని ఆమె తల్లి వెల్లడించింది. దీంతో పంపించక తప్పలేదని పేర్కొంది. ఆ షో ద్వారా మంచి పేరు రావడంతో ఆ తరువాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా బిగ్‌బాస్‌లోకి అడుగు పెట్టిందని ఆమె తల్లి వెల్లడించింది. తన కూతురు బిగ్‌బాస్ టైటిల్ కూడా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.