Bigg boss 6 : సూపర్ స్టార్ కృష్ణకు నిన్న ఇంటి సభ్యులంతా నివాళులు అర్పించారు. అయితే ఈ వారం తనే ఎలిమినేట్ అవుతానని మెరీనా ఫిక్స్ అయినట్టుంది. త్వరలో తమ పెళ్లి రోజు ఉందని.. దానిని తామిద్దరం కలిసే చేసుకోవాలని భావిస్తున్నానని కాబట్టి బయటకు పంపిస్తే ఇద్దరినీ ఒకేసారి పంపించాలని.. లేదంటే ఇద్దరినీ హౌస్‌లోనే ఉంచాలని కోరింది మెరీనా. దీనికి రోహిత్ బిగ్‌బాస్‌కు లేనిపోని ఐడియాలు ఇవ్వకని చెప్పాడు. ఆ తరువాత కెప్టెన్సీ టాస్క్ షురూ. ఈ టాస్క్‌లో బాబోయ్ ఫైమా.. రేవంత్‌ను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుంది.
కెప్టెన్సీ టాస్క్‌లో శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్‌లు పోటీ పడ్డారు. ఎవరి గోల్ పోస్ట్‌లోకి బంతి వేస్తే వారు గేమ్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. తొలుత రోహిత్‌ను ఆదిరెడ్డి తెలివిగా తప్పించేశాడు. అయితే మొదటి రౌండ్‌కు ఫైమా సంచాలక్‌గా వ్యవహరించింది. ఈ గేమ్‌లో రేవంత్, శ్రీహాన్ అయితే మొదట కలిసే ఆడారని చెప్పాలి. ఆదిరెడ్డిని శ్రీహాన్ పట్టుకుంటే రేవంత్ బాల్ అతని కోర్టులోకి వేయడం వంటివి చేశాడు. ఇది చూసిన ఫైమా.. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటాడు, మరి ఇప్పుడు ఈయన చేసేదేంటంటూ రేవంత్‌ను రెచ్చగొట్టడం స్టార్ట్ చేసింది.
అసలే రేవంత్ కాస్త రెచ్చగొట్టినా చెలరేగిపోతాడు. దీంతో ఫైమా మాటలకు అతను ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్నంత సేపు కూడా ఇద్దరి మధ్య ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. మధ్యలో ఆదిరెడ్డి కూడా ఎంటరై ఆద్యం పోశాడు. మొదటి రౌండ్‌లో రోహిత్ అవుట్ అయ్యాడు. రెండో రౌండ్‌లో ఎవరూ అవుట్ కాలేదు. దీంతో ఏకాభిప్రాయంతో ఒకరిని తొలగించాలని బిగ్‌బాస్ చెప్పడంతో ఆదిరెడ్డిని ఆట నుంచి తొలగించేశారు. ఆ తరువాత ఇనయ కూడా అవుట్ అయిపోయింది. ఇక చివరిగా స్నేహితులిద్దరూ మిగిలిపోయారు. శ్రీహాన్ కంటే రేవంత్ స్ట్రాంగ్ కాబట్టి పెద్దగా శ్రీహాన్‌ను తప్పించేందుకు టైం పట్టలేదు. దీంతో రెండోసారి రేవంత్ కెప్టెన్‌గా నిలిచాడు.