Biggboss 6 : మనం ఏం చేస్తే.. తిరిగి మనకు అదే వస్తుంది. లైఫ్‌లో ఇది చాలా మంది విషయంలో చూసే ఉంటాం. ఇక బిగ్‌బాస్‌లో అయితే సిసింద్రీ టాస్క్ ఈ విషయాన్ని కళ్లకు కడుతోంది. బుధవారంతో ఈ టాస్క ముగిసింది. ఈ టాస్క్‌లో ఒక్కొక్కరి పెర్ఫార్మెన్స్ ఒక్కోలా ఉంది. కొందరు ఇతరులను గేమ్ నుంచి తప్పించేందుకు ఎక్కువగా ఆడితే.. మరికొందరు చాలా జాగ్రత్తగా గేమ్‌పై ఫోకస్ పెట్టి ఆడారు. ఇక మరికొందరైతే చాలా లైట్ తీసుకున్నారు. అస్సలంటే అస్సలు ఆటపైనే దృష్టి పెట్టలేదు. ఇతరులను గేమ్ నుంచి తప్పించడంపై ఫోకస్ చేసిన వారిలో గలాటా గీతూ ముందుంది. ఇక గేమ్‌లను లైట్ తీసుకున్న వారిలో శ్రీసత్య, వాసంతి ఉన్నారు. ఇక మిగిలిన వారు దాదాపు ఫోకస్డ్‌గానే ఆడారు.
ఇక రేవంత్ బొమ్మను గీతూ లాస్ట్ అండ్ ఫౌండ్‌లో వేసి ఎంజాయ్ చేసింది గీతూ. ఇక్కడి నుంచే గేమ్ మరో టర్న్ తీసుకుంది. ఇక అంతకు ముందు రేవంత్ టాస్క్ విషయంలో ఫైమా ఏం చేసిందో చివరకు ఆమె విషయంలో కూడా అదే జరిగింది. దీన్నే కర్మ ఈజ్ బూమరంగ్ అంటారేమో. రేవంత్ ఎంత బతిమిలాడినా కూడా ఫైమా సహకరించలేదు. దీంతో రేవంత్ టాస్క్ ఓడిపోయాడు. అదే ఫైమా కోసం రేవంత్ మళ్లీ నిలబడ్డాడు. ఆమె కోసం టాస్క్ ఆడాడు. చివరకు రింగ్‌లో నిలబడ్డ వాడే కింగ్ అనే టాస్కులో ఫైమా ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. వాళ్లకు ఇచ్చిన షీల్డులతోనే తోసేయాల్సి ఉంటుందని రూల్ ఉంది. కానీ ఫైమా మాత్రం తన బాడీని ఉపయోగించి తోసేసింది. దీంతో సంచాలక్‌గా ఉన్న రేవంత్ ఆమెను తీసి పక్కన పెట్టేశాడు.
Biggboss 6 : ఇనయ నిర్ణయాన్ని తప్పుబట్టిన కంటెస్టెంట్స్..
టాస్క్ జరుగుతున్న సమయంలోనే ఫైమా బొమ్మను తీసి అభినయ లాస్ట్ అండ్ ఫౌండ్‌లో పారేసింది. దీంతో ఫైమా మొత్తానికి టాస్కులోంచి బయటకు వచ్చేసింది. దీంతో ఫైమా కన్నీటి పర్యంతమైంది. నన్ను పూర్తిగా ఆడనివ్వకుండా చేశారు.. నా బొమ్మను తీసి పారేశారు అంటూ కీర్తితో చెప్పుకుని వాపోయింది. ఐస్ క్రీం టైం అంటూ.. కోన్స్, స్కూప్స్ అరేంజ్ చేసే ఆటలో.. రాజ్ మొదటి బజర్‌లో గెలిచాడు. సంచాలక్ అయిన ఇనయ చెప్పిన నిర్ణయాన్ని కొందరు తప్పుబట్టారు. రాజ్ తప్పుగా ఆడారంటూ కంప్లైంట్ చేశారు. కానీ ఇనయ తన నిర్ణయాన్ని అప్పటికే ప్రకటించేసింది. ఇక రెండో బజర్‌లో సూర్య గెలిచాడు. అలా చివరకు సిసింద్రీ టాస్క్ పూర్తయ్యే సరికి చంటి, ఇనయ, రాజ్, సూర్యలు ఈ వారం కెప్టెన్సీ కంటెండర్‌లుగా నిలిచారు. మరి ఈ నలుగురిలో కెప్టెన్‌అవుతారో వేచి చూడాలి.