Bigg boss 6 : వామ్మో.. ఈసారి కంటెస్టెంట్స్ అంతా ఐదు సీజన్లు.. దానితో పాటు ఓటీటీని కాచి వడపోసి వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తే.. మంచి మార్కులు పడతాయి? అనే దానిపై దారుణంగా వర్కవుట్ చేశారని వాళ్ల ప్రవర్తనను బట్టి తెలుస్తోంది.నిన్నటికి నిన్న కెప్టెన్సీ టాస్క్ జరిగింది.ఈ టాస్కులో భాగంగా బిగ్‌బాస్ పూల కుండీలపై కెప్టెన్సీ పోటీదారుల ఫోటోలు అతికించాడు. ఒకరి పూలకుండీని తీసుకుని మరొకరు కంటెండర్ జోన్‌లోకి పరిగెత్తాల్సి ఉంటుంది.ఈ టాస్క్‌కి ఫైమా సంచాలక్‌గా వ్యవహరించింది.
మీకు బిగ్‌బాస్ సీజన్ 5 గుర్తుండే ఉంటుంది. ఇలాంటి టాస్కే ఒకటి జరిగింది.అప్పట్లో ఆ టాస్క్‌కి సంచాలక్‌గా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ ఉన్నాడు. మనోడి బ్రెయినే వేరు కదా. అప్పుడు సూట్ కేసులు ఏర్పాటు చేశారు. అప్పుడు షన్ను ఇంటెలిజెంట్‌గా ఆ సూట్‌కేసుల తాళ్లు కట్టి ఉంచాడు.అప్పుడు కంటెస్టెంట్స్ సూట్‌కేస్ తీసుకోబోతుంటే రెండు, మూడు రావడం అలా జరిగింది. అప్పుడు వాళ్లంతా చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ స్ట్రాటజీ వినియోగించినందుకు వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున షన్నుపై ప్రశంసల జల్లు కురిపించారు.
ఫైమా కూడా ఈ వారం సరిగ్గా అదే ఫాలో అయింది. ఒక పూల కుండీలో మరో పూలకుండీని వేసేసి సేమ్ షన్ను స్ట్రాటజీని ప్లే చేసింది. దీనివల్ల కెప్టెన్సీ కంటెండర్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ క్రమంలోనే రేవంత్ వెనకబడిపోయాడు. ఈ విషయమై మనోడు కాస్త ఫైమాపై ఫైర్ కూడా అయ్యాడు.అయితే ఇక్కడ ఫైమా కావాలని రేవంతో మరొకరినో ఆట నుంచి తప్పించాలని అలా చేయలేదు. కేవలం తన మార్క్ వేయడం కోసం షన్ను మాదిరిగి చేసింది. అయితే రేవంత్ ప్రివియష్ షోస్ పెద్దగా ఫాలో అయి ఉండకపోవచ్చు. కానీ మిగిలిన వాళ్లు మాత్రం ఫైమా కరెక్ట్‌గానే చేసిందని అంగీకరించారు.