Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. ఈ నెల ఐదవ తేదీన విడుదలైన ఈ చిత్రం తొలి షో తోనే మంచి హిట్ టాక్‌ను సంపాదించుకుంది.దీనికి ముందు తనయుడు రామ్ చరణ్‌తో కలిసి చేసిన సినిమా ‘ఆచార్య’గట్టి షాక్ ఇవ్వడంతో చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ చిత్రాన్ని రూపొందించారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ రీమేక్‌గా మోహన్‌రాజా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమా మాతృకతో పోలిస్తే చాలా బాగుందని ఆడియన్స్ చెబుతున్నారు. ఇక మెగా ఫ్యాన్స్‌కైతే పట్ట పగ్గాల్లేవు.
ఈ సినిమాకు ఒకరిద్దరు మినహా మిగిలిన సినీ క్రిటిక్స్ అంతా అద్భుతమైన రివ్యూ ఇచ్చారు. అయితే చిరు.. కాస్త ఫ్రీ అయ్యాక ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్‌తో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేశారు. ఫిలిం క్రిటిక్స్ అందరితోనూ చిరు సరదాగా ముచ్చటించారు. సినిమా విజయం.. అంతకు ముందు ఆయన ఫేస్ చేసిన ఇబ్బందుల గురించి ఈ సందర్భంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఫిలిం క్రిటిక్స్ కూడా చిరును అభినందించి.. సన్మానించారు. ఆ వీడియోలో చిరు చాలా సంతోషంగా కనిపించారు.
ఇక‘గాడ్ ఫాదర్’ స్క్రీన్‌ప్లే నిజంగా ఒక వండర్. మలయాళంలోని కొన్ని పాత్రలకు తెలుగులోని కొన్ని పాత్రలు విభిన్నంగా ఉంటాయి. అవన్నీ ఒక థ్రిల్లింగ్‌గా ఉంటాయని దర్శకుడు మోహన్‌రాజా వెల్లడించారు. మెగాస్టార్ సైతం ఈ సినిమా సక్సెస్‌పై ఎంత నమ్మకం పెట్టుకున్నారో పలు సందర్భాల్లో వెల్లడించారు. సినిమా రిలీజ్‌కు ముందు సరిగ్గా ప్రమోషన్స్ చేయడం లేదంటూ కొన్ని మీడియా ఛానళ్లు కొంత వ్యతిరేకంగా వార్తలను వెలువరించాయి. వాటిపై ఇటీవల ఓ సందర్భంలో చిరు మండిపడ్డారు. ఫైనల్‌గా సినిమా విడుదల తర్వాత మంచి రివ్యూలిచ్చి తమను ఎంకరేజ్ చేసిన మీడియాకు అభినందనలు తెలిపారు.
Members of “Film Critics Association” Had Privilege in wonderful Interaction with #MegastarChiranjeevi @KChiruTweets garu and congratulating , felicitating him at his residence over the grand success of #Godfather and for his support 💫💫#MegaStarChiranjeevi @FCAOffice pic.twitter.com/VDIMPZB5cd
— BA Raju's Team (@baraju_SuperHit) October 12, 2022