Festive Fashion : పండుగల సీజన్ వచ్చేసింది. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలందరూ అద్భుతమైన అవుట్‌ఫిట్స్‌ను ధరించి ఫెస్టివ్ సీజన్ ఫ్యాషన్‌ను ప్రమోట్ చేస్తున్నారు. పండుగ వేళ ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేందుకు ఎలాంటి దుస్తులు ధరించాలనే దానిపై ట్రెండీ ఫ్యాషన్ ఫోటో షూట్‌లు చేస్తూ ఫ్యాషన్ ప్రియులను మంత్ర ముగ్థులను చేస్తున్నారు. క్యాజువల్ వేర్‌కు ఫెస్టివ్ వేర్‌కు మధ్య ఉన్న తేడాను తమ వస్త్రధారణ ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నారు. యువ హీరోయిన్‌ల దగ్గరి నుంచి అలనాటి మేటి తారల వరకు వారి వారి పర్సనాలిటీకి తగ్గట్లుగా పూల అలంకరణలతో వచ్చిన అవుట్‌పిట్స్‌ను ధరించి ఈ పండుగ వేళ సరికొత్త ట్రెండ్‌ను పరిచయం చేస్తున్నారు.

Festive Fashion : ఎత్నిక్ దుస్తులను ధరించి మెస్మరైజ్ చేయడంలో బాలీవుడ్ అలనాటి బ్యూటీ మాధురీ దీక్షిత్ ను బీట్ చేసేవారే లేరు. వయసు పైబడినా స్టన్నింగ్ అవుట్‌ఫిట్స్‌ను ధరిస్తూ ట్రెండీ ఫోటో షూట్‌లను చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది మాధురీ. ఇక ఫెస్టివ్ టైమ్స్‌లో మాధురీ ధరించే అవుట్‌ఫిట్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా పండుల సీజన్ కావడంతో మాధురీ దీక్షిత్ అద్భుతమైన పూల అలంకరణలతో వచ్చిన దుస్తులను ధరించి ఈ ఫెస్టివ్ సీజన్‌కు సరికొత్త ఫ్యాషన్‌ను పరిచయం చేస్తోంది.

తాజాగా మాధురీ దీక్షిత్ ఓ ఫెస్టివ్ ఫ్యాషన్ ఫోటో షూట్ కోసం ఫ్లోరల్ ప్రింట్స్ తో వచ్చిన కో ఆర్డ్ సెట్ స్టైల్ అవుట్‌ఫిట్‌ను ధరించి ఫెస్టివ్ ఫ్యాషన్ ఇన్‌స్పిరేషన్ ఇస్తోంది. పింక్ కలర్ క్రాప్ టాప్‌కు జోడీగా ఫ్లేర్డ్ ప్యాంట్ ధరించి దానిపైకి అదిరిపోయే ష్రగ్ వేసుకుని మెరిసిపోయింది మాధురీ. మోతిఫ్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ తో డిజైనర్లు ఈ కో-ఆర్డ్ సెట్‌ను డిజైన్ చేశారు. మినిమల్ మేకప్‌తో సింపుల్ జ్యువెల్లరీని ధరించి మాధురీ కలర్‌ఫుల్ లుక్స్‌తో అదరగొట్టింది. వరుణ్ భల్ క్లాతింగ్ లేబుల్ నుంచి ఈ డిజైనర్ దుస్తులను సేకరించింది మాధురీ. షీతల్ ఎఫ్ ఖాన్ హెయిర్ మేకోవర్ చేయగా బిల్లీ మానిక్ మాధురీ అందానికి మెరుగులు దిద్దింది. స్టైలిస్ట్ యామీ మాధురికి స్టైలిష్ లుక్స్‌ను అందించింది.

అందమైన ఆకర్షణీయమైన చీర లేకుండా ఏ పండుగా పూర్తికాదు. కాలం మారినా పద్ధతులు మారినా చీరకు ఉండే ప్రత్యేకతే వేరు . పండుగల వేళ చీరకట్టుకుంటే వచ్చే ఆ హుందాతనం మాటల్లో చెప్పలేము. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులతో మతులు పోగొట్టే బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ ఫెస్టివ్ సీజన్ కోసం తెల్ల చీర కట్టుకుని అందరి చూపును తనవైపు తిప్పుకుంది.

మల్టీకలర్ ఫ్లోరల్ ప్రింట్స్‌తో వచ్చిన ఈ తెలుపు రంగు ఆర్గాంజ చీరలో జాన్వీ అద్భుతంగా కనిపించింది.

ఇక బాలీవుడ్ మోస్ట్ ఫ్యాషనబుల్ బ్యూటీ మౌనీ రాయ్ ఏ దుస్తులు ధరించినా కంటికి అద్భుతమైన ట్రీట్ ను అందిస్తుంది. చీరకట్టుతో అయినా రెడ్ కార్పెట్ లుక్స్‌తో అయినా మెస్మరైజ్ చేసే అందం ఈ భామ సొంతం. ఈ పండుగ సీజన్ కోసం లెహెంగా సెట్‌తో ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇస్తోంది ఈ చిన్నది.

గులాబీ రంగులో ఉన్న ఫ్లోరల్ లెహంగా సెట్ ధరించి అద్భుతంగా కనిపించింది. స్టన్నింగ్ బ్లౌజ్ వేసుకుని దానికి జోడీగా లెహంగా ధరించింది. వీటికి మ్యాచ్ అయ్యేలా షీర్ దుపట్టాను వేసుకుంది. చెవులకు స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని స్టన్నింగ్ మేకప్‌తో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఈ పండుగల సీజన్ వేళ మీరు అద్భుతమైన ఫ్లోరల్ ఫ్యాషన్‌ను ఫాలో అవుతారని ఆశిస్తున్నాము.
