Fatty liver disease: లివర్ ఫ్యాట్ సమస్య చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా ఆల్కహాల్ అలవాటున్న వారికి లివర్ సమస్యలు రావడం కామన్. కానీ మందు తాగని వారికి కూడా ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తాయని మీకు తెలుసా? అవి గుర్తించే లోపే చాలా వరకు లివర్ దెబ్బతిని ఉంటుంది. భారత్ లో 9 శాతం నుంచి 32 శాతం మంది ఈ ఫ్యాటీ లివర్ జబ్బుతో ఇబ్బంది పడుతున్నారని అంచనా. మరి దీన్ని నివారించాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..
సాధారణంగా లివర్ లో కొవ్వు పరిమిత స్థాయిలో ఉంటే ప్రమాదమేమీ ఉండదు. కానీ, పరిమితి మించితేనే అన్ని చిక్కులు వస్తాయి. లివర్ దెబ్బతింటుంది. లివర్ బరువులో కొవ్వు 5 నుంచి 10 శాతం మించరాదు. ఈ పరిమితి దాటితే స్టీటోసిస్ బారిన పడతారు. అదనపు కొవ్వు పేరుకుపోతే హెపాటిక్ స్టీటోసిస్ అని పిలుస్తారు. వీటి లక్షణాలు బయటకు కనిపించకపోవడం మనకు పెద్ద మైనస్. అందుచేత రోగాన్ని గుర్తించడం అంత త్వరగా జరగదు. ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
అయితే, ఈ ఫ్యాటీ లివర్ సమస్యకు దూరంగా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాద కారకాలను నియంత్రించాలి. ముఖ్యంగా నిద్ర అలవాట్లు మార్చుకోవాలని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఎన్సీబీఐలో ప్రచురితమైన ఓ నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. చెడు ఆహార అలవాట్ల వల్లనే ఈ ఫ్యాటీ లివర్ సమస్యలొస్తాయని నివేదిక తేల్చింది. సరిగా నిద్రపోకున్నా, పగటిపూట ఎక్కువ పడుకున్నా ఈ సమస్యలు అధికంగా వస్తాయని చెప్పింది.
Fatty liver disease:
తగినంత నిద్ర ఉంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చని తెలిపింది. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం ప్రధానమని పేర్కొంది. నికోటిన్, కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవద్దని నివేదిక సూచించింది. బెడ్ రూమ్ లో ప్రశాంతత ఉండేలా చూసుకోవాలంది. అప్పుడే నిద్ర హాయిగా పడుతుందని తెలిపింది. రోజూ కొంత వ్యాయామం చేయాలని, పడుకొనే ముందు ఫోన్లు పక్కన పెట్టేయాలని హెచ్చరించింది.