Fatty foods for weight loss: బరువు తగ్గాలనుకుంటే ఎక్కువ కేలరీలు, కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని తీసుకోకూడదని చెబుతూ ఉంటారు. అందుకే కొవ్వు ఎక్కువ ఉండే పదార్థాలపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉంటాయి. వీటిని తీసుకుంటే ఎక్కువ శక్తి అందుతుందని, దాని వలన బరువు పెరుగుతామని చాలామంది అనుకుంటారు. కాని మనం తినే ఆహారంలో అన్నిరకాల పోషకాలు ఉండాలి. అంతేకాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి కొవ్వు పదార్థాలు చాలా అవసరం. అందువల్ల ఆరోగ్యంగా బరువు తగ్గడానికి హెల్తీ డైట్‌పై దృష్టిపెట్టాలి. బరువు తగ్గేందుకు సహాయపడే గుడ్లు, చేపలు, డార్క్ చాక్లెట్, కొబ్బరి, అవొకాడో వంటి ఆహార పదార్థాలపై అవగాహన పెంచుకోవాలి.
హెల్తీ డైట్
గుడ్డు సొన తింటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువని అందరూ భావిస్తుంటారు. కానీ ఇదో పెద్ద అపోహ. బరువు తగ్గాలనుకునేవారు కూడా గుడ్డ మొత్తం తీసుకోవచ్చు. ఎగ్ వైట్(egg white)లో ప్రోటీన్ సమృద్ధిగా ఉండడం వలన ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. అలాగే సముద్రపు చేపల్లో కొవ్వు ఎక్కువ అని భావిస్తాం. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ మనం బరువు తగ్గడానికి తోడ్పడతాయి.
కొన్ని రకాల డార్క్ చాకెట్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే కోకోవా బటర్ ఆకలిని కంట్రోల్ చేసి బరువు నియంత్రణకు సహాయపడతాయి. ఇవి రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అలాగే కొబ్బరితో చేసిన ఆహార పదార్థాలు, కొబ్బరి నూనెతో చేసే వంటకాలు తిన్నా బరువు పెరుగుతారని మనం అపోహ పడతాం.
Fatty foods for weight loss:
కొబ్బరిలో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ వలన ఎలాంటి హానీ ఉండదు. కొబ్బరి తినడం వలన పొట్టచుట్టూ పేరుకుపోయే ప్రమాదకరమైన కొవ్వులను తగ్గించే గుణం ఉంటుంది. అవొకాడోల్లో అధికంగా ఉండే ఫ్యాట్స్ బరువు తగ్గేందుకు సహాయపడతాయి. వీటిల్లో ఉండే ఫైబర్, ప్రోటీన్ వంటివి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. దీంతో ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోకుండా కాపాడతాయి.