Fatima Sana Shaikh : ఫాతిమా సనా షేక్ తన సోయగాల ప్రదర్శనతో సోషల్ మీడియానే షేక్ చేసేస్తోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్ పిక్స్‌ను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే ఈ భామ తాజాగా అదిరిపోయే అవుట్‌ఫిట్‌లో దర్శనమిచ్చి కుర్రాళ్ల మనసు దోచేసింది. తనన గ్లామర్ షోతో ఫాతిమా సనా షేక్ ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. లేటెస్ట్‌గా ఓ ఫోటో షూట్ కోసం దిగిన పిక్స్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి అందరిని ఆకట్టుకుంటోంది ఈ భామ. కోఆర్డ్ సెట్.

Fatima Sana Shaikh : చైన్ టాసెల్స్ , కట్ అవుట్ డీటైల్స్‌తో, రౌండ్ నెక్‌లైన్ కలిగిన స్లీవ్‌లెస్ బ్లాక్ కలర్ కార్సెట్ టాప్ వేసుకుంది. ఈ టాప్‌కు మ్యాచ్ అయ్యేలా చేతికి అదే ప్యాట్రన్స్ తో వచ్చిన గ్లౌజ్‌ను తొడుక్కుంది. రచెడ్ డీటెయిల్స్‌తో థై హై స్లిట్‌తో వచ్చిన ప్లెయిన్ బ్లాక్ స్కర్ట్‌ను వేసుకుని తనన నాభి అందాలను చూపిస్తూ కుర్రాళ్ళను రెచ్చగొట్టింది ఫాతిమా. ఈ అవుట్‌ఫిట్ తో లేటెస్ట్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తోంది ఈ బ్యూటీ.

ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా మేకోవర్ అయ్యింది ఫాతిమా. మినిమల్ మేకప్‌ను వేసుకున్నా ఎంతగానో మెస్మరైజ్ చేసింది. కనులకు ఐ లైనర్, కనురెప్పలకు మస్కరా వేసుకుని పెదాలకు న్యూడ్ పింక్ లిప్ స్టిక్ పెట్టుకుంది. తన కురులను లూజ్ గా వదులుకుని క్రేజీ లుక్స్‌తో కెమెరాకు పోజులు ఇచ్చి యూత్‌ను పరేషాన్ చేసింది ఈ చిన్నది.

ఈ అదిరిపోయే అవుట్‌ఫిట్‌ను ఫాతిమా శృతి కౌర్ డిజైనర్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. ఫ్యాషన్ స్టైలిస్ట్ నిషితా పర్వానీ ఫాతిమాకు స్టైలిష్ లుక్స్ ను అందించింది. మేకప్ ఆర్టిస్ట్ భైరవీ ఫాతిమా అందానికి మెరుగులు దిద్దింది.

రీసెంట్‌గా మరో అద్భుతమైన అవుట్‌ఫిట్‌తో ఫోటో షూట్ చేసి ఇంటర్నెట్‌లో మంటలు రేపింది ఈ ముద్దుగుమ్మ. ఫాతిమా ఈ మధ్యనే జరిగిన అమీర్ ఖాన్ కుమార్తె, ఇరా ఖాన్ నిశ్చితార్థం కోసం, ఆమె బోహో చిక్ అవుట్‌ఫిట్ వేసుకుని పార్టీలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. పాయల్ సింఘాల్ డిజైన్ చేసిన ఈ దుస్తుల్లో నృత్యం చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

థ్రెడ్ డీటెయిల్స్, సీక్విన్స్ తో డిజైన్ చేసిన మల్టీ న్యూడ్ కలర్స్ స్లీవ్ లెస్ కర్సెట్ టాప్ వేసుకుని దానికి జోడీగా సీక్విన్ ఎంబ్రాయిడరీ డీటెయిల్స్‌తో వచ్చిన వైట్ కలర్ వైడ్ లెగ్స్ ప్యాంట్‌ను ధరించింది ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేసింది. ఈ అవుట్ ఫిట్‌కు తగ్గట్లుగా రాధికా అగర్వాల్ స్టూడియో నుండి జ్యువెల్లరీ ని ఎన్నుకుని గ్లామరస్ లుక్స్‌తో అదరగొట్టింది.

ఫ్యాషన్ స్టైలిస్ట్ అక్షితా ఫాతిమాకు స్టైలిష్ లుక్స్ ను అందించింది. మేకప్ ఆర్టిస్ట్ భైరవీ ఫాతిమా అందానికి మెరుగులు దిద్దింది. ఈ పిక్స్ ను తన ఇన్‌స్టాలో చేసి అందరిని మంత్రముగ్థులను చేసింది ఫాతిమా.
