జాతి రత్నాలు మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హైదరాబాద్ ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఢీ సీక్వెల్ లో నటిస్తున్న ఈమె నాగార్జున,నాగచైతన్య కలిసి నటిస్తున్న బంగార్రాజు మూవీలో ఐటెం సాంగ్ చేసింది.ఇక మొన్న జరిగిన బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలేలో కనిపించి కనువిందు చేసిన చిట్టి తాజాగా ఒక క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకుంది.
ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ఘోస్ట్ మూవీలో ముందుగా కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.ఆమెపై చాలా యాక్షన్ సీక్వెన్స్ లను డిజైన్ చేశారు.అయితే తాజాగా కాజల్ అగర్వాల్ గర్భం దాల్చడంతో ఆమెను ఈ మూవీ నుండి తప్పించి ఈ అవకాశాన్ని చిట్టికి ఇచ్చారని సమాచారం.