జాతి రత్నాలు మూవీలో చిట్టిగా నటించి వెండి తెర ప్రేక్షకులను మెప్పించిన హైదరాబాద్ ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లాకు ఆ మూవీ వల్ల మంచి పేరు వచ్చినప్పటికీ ఆశించిన అవకాశాలు రాలేదు.తాజాగా అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో క్యామియోలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో ఒక ఫుల్ లెంత్ మూవీలో నటించే అవకాశం అందిపుచ్చుకుంది.
ప్రస్తుతం ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న శ్రీనువైట్ల – మంచు విష్ణు తాజాగా ఢీ అండ్ ఢీ మూవీ చేయబోతున్నారు.ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.గతంలో ఢీ మూవీతో సూపర్ హిట్ అందుకున్న శ్రీనువైట్ల – మంచు విష్ణు ఈసారి ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారో లేదో వేచి చూడాలి.