BIGG BOSS: బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ప్రేక్షకులను మెప్పించడానికి చేసే ఓ ప్రయత్నం. ఇలా మెప్పించడం ద్వారా ప్రేక్షకులను మెప్పుతో పాటు ఆ ఛానల్ రేటింగ్ కూడా పెరిగిపోతుంది. బిగ్ బాస్ షో కోసం వచ్చిన కంటెస్టెంట్స్ కి కూడా డబ్బులు ఇస్తారు. ఇలా ఒకదానికి ఒకటి ముడి పడి ఉంటుంది. ఇంతటి పెద్ద ప్రాసెస్ ఉన్న బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ గా వ్యవహరిస్తున్న వారు ఇస్తున్న ప్రదర్శన అనేది చాలా ముఖ్యం.
ఇదంతా మాకెందుకు అనుకుంటున్నారా…? అక్కడికే వస్తున్నా.. బిగ్ బాస్ హౌస్ లో శుక్రవారం ఎపిసోడ్ లో ప్రేక్షకులను నవ్వించడానికి కమెడియన్ ఫైమా మంచి ప్రయత్నమే చేసింది. హౌస్ లో రాజ్, ఫైమా, చంటి, శ్రీసత్య, అర్జున్, ఆదిరెడ్డి ఓ చోట కూర్చోని ఉంటారు. ఈ క్రమంలో రాజ్ మీద పడుతూ ప్లీజ్ రా.. ప్లీజ్ రా… క్షమించు రా అంటూ రాజ్ ని సతాయిస్తుంది ఫైమా. క్షమించాను అంటాడు రాజ్. ఎందుకు క్షమించావు రా నేను అడిగితే క్షమిస్తా అంటుంది ఫైమా. ఈ క్రమంలో ఫన్నీగా ఫైమా భుజం పైన రాజ్ చేసి వేసి భయపెట్టిస్తాడు. దీంతో ఫైమా ఫన్నీ పర్పామెన్స్ స్టార్ట్ చేస్తుంది.

ఇప్పుడు నీవు నా మీద చేయి వేసింది ప్రజలంతా చూసి నన్ను పెళ్లి చేసుకోకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ… ఇంకోసారి నామీద చేయి వేసేటప్పుడు ఆలోచించుకుకో అంటూ ఫైమా కామెడీ చేస్తుంది. నిన్న నడుము గిల్లాడు కదా అని సత్యకు ఎలా గిల్లాడో చూపిస్తుంది ఫైమా. దీంతో ఫైమా తాకిడి తట్టుకోలేక రాజ్ అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ రేవంత్ అడ్డుకుని రాజ్ ను అక్కడే ఉండేలా కూర్చోబెడతాడు.
నేను ఎన్నో గోల్స్ పెట్టుకుని ఇక్కడి వచ్చాను.. ఇప్పుడు నా నడుము గిల్లితే చూసే వాళ్లు ఏమనుకుంటారు అని ఫైమా అంటుంది. ఈ అమ్మాయికి పెళ్లి ఎట్లా అవుతుందని శ్రీసత్య మధ్యలో దూరి రాజ్ ని అడుగుతుంది. వెంటనే తాళి కడితే పెళ్లి అవుతుంది అది వేరే విషయం అంటూ కుళ్లు జోక్ వేస్తుంది.. దీంతో అందరూ ఫైమా పంచ్ ని అక్కడ ఉన్న రాజ్ తో పాటు చంటి కూడా తూ అంటూ ఫన్నీగా కమెంట్ చేస్తారు. ఫైమా ఇలా వచ్చి కూర్చో అంటాడు రాజ్. దీంతో మళ్లీ ఫైమా తన పర్పామెన్స్ స్టార్ట్ చేస్తుంది. ఇలా రాజ్ ని శుక్రవారం ఎపిసోడ్ లో ఫైమా ఓ రేంజ్ లో ఫైమా ఆడుకుంటుంది.