ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ మన ఇంట నవ్వులు,పువ్వులు పూయించిన ఎఫ్ 2 చిత్ర టీం. మనల్ని మళ్ళీ నవ్వించడానికి ఎఫ్ 3 చిత్రంతో రానున్నారు.ఎఫ్2 చిత్రంలో నటించిన వెంకటేష్,తమన్నా,వరుణ్ తేజ్, మెహ్రిన్ లతో పాటు ఈ సీక్వెల్ లో సునీల్ కనపించనున్నాడు.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.తాజాగా అనిల్ రావిపూడి చార్మినార్ ఏరియాలో వెంకటేష్, వరుణ్‌తేజ్ మీద పాటకు సంబంధించిన సీన్స్ ను చిత్రీకరించారు.దిల్ రాజు,శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నది.
ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వడంతో ఈ మూవీ సీక్వెల్ కోసం ఫ్యామిలీ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.