ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ మన ఇంట నవ్వులు,పువ్వులు పూయించిన ఎఫ్ 2 చిత్ర టీం. మనల్ని మళ్ళీ నవ్వించడానికి ఎఫ్ 3 చిత్రంతో రానున్నారు.ఎఫ్2 చిత్రంలో నటించిన వెంకటేష్,తమన్నా,వరుణ్ తేజ్, మెహ్రిన్ లతో పాటు ఈ సీక్వెల్ లో సునీల్ కనపించనున్నాడు.ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారు.ముందుగా అనౌన్స్ చేసినట్టు వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో రావాల్సిన ఈ మూవీ ప్రస్తుతం మహా శివరాత్రి సమయానికి సిద్ధం అవుతుంది.
ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీలో రెండు పాటలు కొన్ని సన్నివేశాలు మిగతా అంతా కంప్లీట్ అయిపోయింది.విక్టరీ వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ రెండు ఓటిటి చిత్రాల రిలీజ్ లనంతరం ఈ మూవీతో వెంకటేష్ ప్రేక్షకులను థియేటర్స్ పలకరించనున్నారు.