Eye Health: ప్రస్తుతకాలంలో మొబైల్,లాప్టాప్ లును చూడకుండా ఒక్కరోజు కూడా గడపటం చాలా కష్టంగా మారిపోయింది. చిన్న,పెద్ద తేడాలేకుండా ప్రతిఒక్కరు మొబైల్ ఫోన్ కు అడిక్ట్ అయిపోతున్నారు. ఎక్కువ సమయం వీటిని చూడటంవల్ల కంటిచూపు క్షీణించటం జరుగుతుంది. సంవత్సరానికి దాదాపుగా ఒక బిలియన్ మంది తాత్కాలిక లేదా దీర్ఘకాలిక కంటి సమస్యతో బాధపడుతున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదికలో వెల్లడించటం జరిగింది.
మన కంటిని ఆరోగ్యముగా ఉంచుకోవటం మన చేతిలో ఉంది .కాబట్టి మనకు అందుబాటులో ఉన్నవాటితో సహజ మార్గాలు పాటిస్తూ కళ్ళను ఆరోగ్యముగా ఉంచుకోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. మరి మన కళ్ళను రక్షించుకోవటానికి కొన్ని సహజమైన చిట్కాలు మీకోసం.
ఎండు ద్రాక్ష:
ప్రతి రోజు ఉదయం నానబెట్టిన ఎండు ద్రాక్ష తినటంవల్ల కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు ఎందుకంటే ఎండు ద్రాక్షలో ఉండే పాలీఫెనోలిక్ ఫైటోన్యూట్రియోంట్లు కంటి చూపును దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలిస్తాయి.
నెయ్యి:
కంటి చూపును మెరుగుపరిచే “విటమిన్ ఏ” నెయ్యిలో పుష్కలంగా లభిస్తుంది. అలాంటి నెయ్యిని ఆయుర్వేదంలో కంటి సమస్యలను పోగొట్టటానికి ఉపయోగిస్తారు.
రాక్ సాల్ట్:
రాక్ సాల్ట్ ను మనం తినే వంట్టల్లో వాడితే కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు.
Eye Health: ఉసిరి:
తేనెలో యాంటిసెప్టిక్, యాంటీబయాటిక్, విటమిన్ బి 1,విటమిన్ బి6 అధికంగా ఉంటాయి .అందుకే కంటి సమస్యలను పోగొట్టే ఔషధం తేనె అని చెబుతుంటారు. అలాగే క్యారెట్ జ్యుసులో తేనెని కలుపుకొని తాగితే కంటి చూపు సమస్యలు త్వరగా తగ్గుతాయి.