Eye Health: ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్నారు పెద్దలు..ప్రతి మనిషికి కళ్ళు చాలా ముఖ్యమైనది. కళ్లు లేకపోతే మన జీవితమే చీకటి మయమవుతుంది. ఇది అక్షరాలా సత్యం. మన జీవితంలో ఇంత ముఖ్యమైన మన కళ్ళను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కళ్లు చాలా సెన్సిటీవ్. వీటిని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే.. మన కంటి చూపు అంత మెరుగ్గా ఉంటుంది. కంటిచూపు బాగుండాలన్నా.. కళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా..ఫోన్, ల్యాప్ టాప్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను చూసే టైంను తగ్గించుకోవాలి. అయితే కొంతమంది కళ్లు ఎప్పుడూ ఎర్రబారే ఉంటాయి. కంటినిండా నిద్రలేకపోతే కూడా కళ్లు ఎర్రబడుతాయి. అలాగే ఎదైనా అనారోగ్య సమస్య ఉంటే కూడా కళ్లు ఎర్రగా మారుతాయి. తరచుగా కళ్లు ఎర్రగా మారడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై ఐ సిండ్రోమ్
ఎక్కువ సేపు కంప్యూటర్, ల్యాప్ టాప్, ఫోన్ స్క్రీన్ ను చూడటం వల్ల కూడా కండ్లు పొడిబారుతాయి. దీనివల్ల కూడా కండ్లు ఎర్రగా మారుతాయి. అలాగే ఎక్కువ సేపు కంటి రెప్పలను వాల్చకపోవడం వల్ల కూడా కండ్లు డ్రై అయిపోతాయి. అందుకే తరచుగా కళ్లను మూస్తూ ఉండాలి. అలాగే అప్పుడప్పుడు ఐ డ్రాప్స్ ను కూడా వాడుతూ ఉండాలి.
వైరల్ కండ్లకలక:
ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దీనినే మనం కండ్ల కలక అంటాం. కండ్లకలక వల్ల కండ్ల వాపు వస్తుంది. దీనివల్ల కనుగుడ్డుపై సన్నని పొర ఏర్పడుతుంది. ఇది కన్నును పూర్తిగా కప్పి ఉంచుతుంది. దీంతో కళ్లు ఎర్రబడటమే కాదు.. నొప్పి కూడా పెడుతుంది. మంటగా కూడా అనిపిస్తుంది. అలాగే వాపు కూడా ఉంటుంది. ఇవి వైరల్ కండ్లకలక సంకేతాలు. ఇలాంటి సమయంలో డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Eye Health: కోవిడ్-19
కోవిడ్ నుంచి కోలుకున్నా.. దీని లక్షణాలు మాత్రం కొందరిలో చాలా కాలం వరకు ఉంటాయి. వీటివల్ల గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను ఫేస్ చేస్తున్నవారిలో కూడా కండ్లు ఎర్రబడతాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ కండ్ల నుంచి శరీరంలోకి ప్రవేశించిన వారిలో కండ్లు ఎర్రబడతాయట. కరోనా వచ్చి తగ్గిపోయినా కండ్లు ఎర్రబడితే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాకుండా కొన్ని రకాల అలెర్జీల వల్ల కూడా కండ్లు ఎర్రగా మారతాయి. అలాగే కళ్లలో మంట, దురద వంటి సమస్యలు కూడా వస్తాయి.