Ex Mp Renuka Chowdary: ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన ఎవరి రాష్ట్రంలో వాళ్లు రాజకీయాలు చేసుకుంటుున్నాయి. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు వెళ్లి అక్కడ రాజకీయం చేశారు. కానీ అది బెడిసికొట్టి టీఆర్ఎస్ కు కలిసొచ్చింది. ఇక కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. కానీ తాజాగా తెలంగాణకు చెందిన ఓ మహిళా నాయకురాలు ఏపీ రాజకీయాల్లోకి అడుగపెట్టింది. అంతేకాదు అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపింది. రైతుల పాదయాత్రలో పాల్గొని పాల్గొన్నారు. ఆమె ఎవరో కాదు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస సీనియర్ నాయకురాలు, ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి.
జగన్ సర్కార్ మూడు రాజధానుల బిల్లును మళ్లీ అసెంబ్లీలో పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో అమరావతి రైతులు అమరావతి టూ అరసవిల్లికి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభం సందర్బంగా రేణుకా చౌదరి స్వయంగా అమరావతి వచ్చి రైతులకు సపోర్ట్ చేశారు. ఈ సందర్బంగా జగన్ పై ఆమె దుమ్మెత్తిపోశారు. జగన్ పాలన అసలు చేతకాడు అనేశారని, ఆయన మూర్ఖుడు అని దారుణమైన కామెంట్స్ చేశారు.
ఏపీలో జగన్ పాలన ఎప్పుడు పోతుందా అని జనమంతా ఎదురుూస్తున్నారని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. మరికొద్ది నెల్లో జగన్ ఓడటం ఖాయమని, ఏపీ రాజధాని ఎక్కడికీ పోదని, జగన్ మాజీ సీఎం అయిన తర్వాతనే అమరావతికి ఊపిరి అని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. అమరావతికి మోదీ వచ్చి శంకుస్థాపన చేశారని, కానీ రాజధాని రైతులు ఇన్ని అవస్థలు పడుతుంటే బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Ex Mp Renuka Chowdary:
అమరావతి వస్తూ ఉంటానని, రైతులకు అండగా ఉంటానని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. అమరావతి రైతులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటానని స్పష్టం చేశారు. రాజధాని రైతుల ఉద్యమం అందరికీ స్పూర్తిగా నిలుస్తుందని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. జగన్ మాజీ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని తెలిపారు.