భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’కు బాయ్‌కాట్ సెగ తగిలింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్టార్ కిడ్స్ అయిన రణ్‌బీర్ కపూర్ హీరోగా, ఆలియాభట్ హీరోయిన్‌గా నటించింది. నచ్చకపోతే సినిమా చూడకండని ఆలియా పొగరుగా మాట్లాడడం, నెపోటిజాన్నిఎంకరేజ్ చేసే కరణ్ జోహార్ నిర్మాత కావడంతో ఈ సినిమాని కూడా బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్ చేశారు. దాని నుంచి బయటపడేందుకు మూవీ టీం విశ్వ ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ గెస్ట్‌గా నటించిన వానరాస్త్రకి సంబంధించిన ప్రొమోని చిత్రబృందం విడుదల చేసింది. దీంతో మరోసారి Boycott Bollywood తెరమీదకి వచ్చింది.
ఈ భారీ చిత్రానికి స్టార్ హీరో షారుఖ్ గెస్ట్‌గా అప్రీయరెన్స్ ఇచ్చారు. ఈ ప్రోమో చూసి షారుఖ్ ఫ్యాన్స్ ఫిదా అవుతూ తెగ వైరల్ చేస్తున్నారు. అయినప్పటికీ బాయ్‌కాట్ ప్రభావం ఏ మాత్రం తగ్గకపోవడం ఆశ్యర్యం కలిగిస్తోంది. పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. బాయ్‌కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఈ కొత్త ప్రొమోలో వినిపించే వాయిస్ దీపికా పదుకొనేది అయి ఉంటుందని నెటిజన్లు ఊహిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా.. జల్ దేవి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ సైతం ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ నెల 9న విడుదలకు సిద్ధంగా ఉంది.
కాగా బాలీవుడ్‌లో ప్రస్తుతం బాయ్‌కాట్ ట్రెండ్ కొనసాగుతుంది. దీంతో ప్రముఖ హీరోలు, హీరోయిన్లు నటించిన పలు సినిమాలు ఫ్లాప్స్‌గా మిగిలిపోతున్నాయి. తాజాగా అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ నటించిన ‘రక్షాబంధన్’ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దానికి కారణం బాయ్‌కాట్ అనే చెప్పొచ్చు.