గతంలో మాటివిలో ప్రసారమయ్యే మీలో ఎవరు కోటీశ్వరులు ఇప్పుడు జేమినిలో ఎవరు మీలో కోటీశ్వరులుగా ప్రసారం అవుతుంది.ఈ షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.తాజాగా తెలంగాణకు చెందిన ఎస్సై రాజా రవీంద్ర ఈ షోలో కోటి రూపాయలు గెలుచుకున్నారు మరి ఈ షోలో ఆయన్ని ఎన్టీఆర్ ఏ ప్రశ్నలు అడిగారో వాటికి రాజా రవీంద్ర ఏం సమాధానాలు చెప్పారో ఇప్పుడు చూద్దాం
1.సాధారణంగా వీటిల్లో దేనిమీద ఎక్స్ పైరీ డేట్ ఉండదు?
ఆధార్ కార్డు, పాస్ పోర్టు, డెబిట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్.
ఆన్సర్ : ఆధార్ కార్డు
2.ఈ విగ్రహంలో కనిపిస్తున్నది ఎవరు?
మహా వీర, బాహుబలి, బుద్దుడు, గురునానక్.
ఆన్సర్- బుద్దుడు
3.భారతదేశం కన్నా ఎక్కువ జనాభా ఉన్న దేశాల సంఖ్య ఎన్ని?
ఒకటి, రెండు, మూడు, నాలుగు.
ఆన్సర్ : ఒకటి
4.2019లో ఇండియన్ హోం మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టింది ఎవరు?
నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కారీ, రవిశంకర్ ప్రసాద్, అమిత్ షా.
ఆన్సర్: అమిత్ షా
5.కత్తి సాము, సిలంబం, కలరిపయట్టు అనేవి దేనికి ఎగ్జాంపుల్స్?
నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, మార్షల్ ఆర్ట్స్.
ఆన్సర్: మార్షల్ ఆర్ట్స్
6.రేడియో ప్రసారాల్లోని ఏఎమ్.ఎఫ్ఎమ్ లో ఎమ్ దేనిని సూచిస్తుంది?
మీటర్, మాడ్యులేషన్, మాగ్నిట్యూడ్, మిషన్.
ఆన్సర్: మాడ్యులేషన్
7.ఏపీలోని అంతర్వేది దగ్గర బంగాళఖాతంలో కలిసే నది ఏది?
కృష్ణ, తుంగభద్ర, పెన్నా, గోదావరి.
ఆన్సర్: గోదావరి
8.ఏ మానవ అవయవాల్లో ఐరిస్, లెన్స్, రెటీనా ఉంటాయి?
ఊపిరితిత్తులు, చెవులు, కళ్లు, కడుపు.
ఆన్సర్: కళ్లు
9.హిందూ పురాణాల్లో వీరిలో కర్ణుడి గురువు ఎవరు?
వ్యాసుడు, పరశురాముడు, పాండు రాజు, కృష్ణుడు.
ఆన్సర్: పరశురాముడు
10.ఆగస్టు 2021లో ఆపరేషన్ దేవిశక్తిలో భాగంగా ఏ ప్రాంతం నుండి భారత ప్రభుత్వం 800 మంది జనాన్ని తరలించింది?
అఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా, మయన్మార్.
ఆన్సర్: అప్ఘనిస్తాన్
11.భారత్ స్వాతంత్ర్యం పొందినప్పుడు బ్రిటీష్ వైస్రాయ్ ఎవరు?
లార్డ్ వేవెల్, లార్డ్ మౌంట్ బాటెన్, లార్డ్ ఎల్గిన్, లార్డ్ రిప్పన్.
ఆన్సర్: లార్డ్ మౌంట్ బాటెన్
12.ఒకే పారా ఒలింపిక్స్ లో బహుళ పతకాలు సాధించిన మొదటి భారత మహిళ ఎవరు?
అవనీ లేఖరా, దీపా మాలిక, అంజలీ భగవత్, భవీనా పటేల్.
ఆన్సర్: అవనీ లేఖరా
13.2020లో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఏ పదం, ఇటాలియన్ భాషలో ’40 రోజులు’ అని అర్థం వచ్చే ఒక పదం నుండి వచ్చింది?
లాక్‌డౌన్,ఐసోలేషన్,క్వారంటైన్,పాండమిక్
ఆన్సర్ : క్వారంటైన్
14.జాతీయ వైద్యుల దినోత్సవం ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు వైద్యుడు అయిన ఒక వ్యక్తి జ్ఞాపకార్థం జరుపుతారు?
మిజోరాం,పశ్చిమబెంగాల్,ఉత్తరప్రదేశ్,కేరళ
ఆన్సర్ : పశ్చిమబెంగాల్
15.1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణమైన కమిషన్‌కు, ఎవరు అధ్యక్షత వహించారు?
రంగనాథ్ మిశ్రా,రంజిత్‌సింగ్ సర్కారియా,బీపీ మండల్,ఫజల్ అలీ కమిషన్
ఆన్సర్ : ఫజల్ అలీ కమిషన్
అని 15 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్నారు.