Entertainment: హీరోయిన్స్ అనగానే టక్కున అందరికీ గ్లామర్ రోల్స్ గుర్తుకువస్తాయి. అందమైన దుస్తుల్లో హీరోయిన్లు దేవకన్యల లాగా మెరిసిపోవడం గుర్తుకు వస్తుంది. ఇవి చేసే హీరోయిన్లు కొంతమంది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా పోషించారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది వ్యభిచారి పాత్ర గురించి. ఇలాంటి పాత్రలు అందరూ చేయలేరు. అలా మనల్ని మెప్పించిన కొంతమంది హీరోయిన్ల పేర్లు పరిశీలిద్దాం. వీరిలో స్టార్ హీరోయిన్ లు కూడా ఉన్నారు.
వేశ్య పాత్రల్లో ఔరా అనిపించిన ముద్దుగుమ్మలు..
రమ్యకృష్ణ:
ఈ తరం ప్రేక్షకులకి ఆమె రాజమాత శివగామి దేవి పాత్రలో బాగా పరిచయం ఉండవచ్చు. కానీ 90లలో ఆమె చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేసి ఉండరు. స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న రోజుల్లో రమ్యకృష్ణ నెగటివ్ పాత్రలు కూడా వేశారు. కమల్‌హాసన్ పంచతంత్రం చిత్రంలో వ్యభిచారి పాత్ర వేసి అందరి మన్నలను పొందారు.
అనుష్క:
ఈ కన్నడ కస్తూరి ఈ తరం హీరోయిన్ లలో స్టార్ స్టేటస్ చూసిన అతి తక్కువ మందిలో ఒకరు. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన వేదం చిత్రంలో వ్యభిచారి పాత్రతో ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆమె తప్ప ఇంకెవరూ ఈ పాత్ర చేయలేరు అనే విధంగా చేశారు.
Entertainment: స్నేహ:
హోమ్లీ క్యారెక్టర్లతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్నేహ కూడా వ్యభిచారి పాత్రలో మెరిశారు. ఈ బాపూ గారి బొమ్మ పదుపెట్టేయ్ అనే చిత్రంలో ఈ పాత్ర వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. వీళ్లతో పాటు చాలా మంది హీరోయిన్లు ఈ తరహా పాత్రలు పోషించి మెప్పించారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీయాశరన్,ఛార్మీ,సదా,హరిప్రియ,సంగీత,హాట్ యాంకర్ ఉదయభాను ఈ పాత్రలు వేశారు. ఈ పాత్రను ఎంచుకోవడం ఒక సవాలు అయితే,అందరి చేతా శభాష్ అనిపించేలా ఈ పాత్రలు చేశారు ఈ హీరోయిన్లు. వీరి ధైర్యాన్ని ఎంతైనా మెచ్చుకుని తీరాలి.