నిన్నటి ఎపిసోడ్‌లో వేద, యశోధర్‌లతో పాటు మాళవిక కూడా కోర్టుకు వెళ్తుంది. అక్కడ మాళవిక అన్న మాటల్ని తలుచుకుంటూ బాధపడుతుంది వేద. లాయర్ ఝాన్సీ, మాళిని వేదకు ధైర్యాన్ని నూరి పోస్తారు. ఆ తర్వాత జడ్డి కోర్టులోకి ఎంట్రీ ఇస్తాడు. లాయర్‌లిద్దరూ తమ తరఫున వాదనలు వినిపిస్తారు. ఆ తర్వాత నవంబర్ 29న ఏం జరిగిందో చూద్దాం..
ఆక్సిడెంట్‌లా కనిపిస్తున్నా ఇదొక హత్యాప్రయత్నం అంటూ వాదిస్తుంది ఝాన్సీ. ఇదంతా కట్టుకథ అంటూ కొట్టుపారేస్తాడు పరమేశ్వర్. ప్రూఫ్స్ ఉన్నాయా అని అడగ్గా.. ఎవరూ నిరూపించాల్సిన అవసరం లేదు. నేనే ఒప్పుకుంటున్నా అంటుంది మాళవిక. కోర్టు బోననులోకి వెళ్లి.. నా పేరు మాళవిక. ఎక్స్ వైఫ్ ఆఫ్ మిసెస్ యశోధర్. జడ్జి గారు నేను సింగిల్ మధర్‌ని. యశోదర్ రెండో భార్య కావాలని నా మీద దొంగ కేసు పెట్టి కక్ష సాధిస్తుంది. అసలు క్రిమినల్ నేను కాదు సార్.. ఆ వేద అంటూ నటిస్తుంది. నా పగబట్టి నా పిల్లల్ని అనాధ చేయాలని చూస్తుంది. నా వల్ల కాదు యువరానర్.. అందుకే ఏ తప్పు చేయకున్న తప్పు ఒప్పుకుంటున్న. నన్ను జైల్లో పెట్టండి అంటూ ఆక్టింగ్ చేస్తుంది. ఇపుడు నీ కడుపు మంట చల్లారిందా వేద? అంటూ కోర్టులోనే వేదని నిలదీస్తుంది. నవ్ దాని మాటలేమి పట్టించుకోకు వేద అంటూ ధైర్యం చెబుతుంది మాళిని. జడ్జి గారు నన్ను జైలుకు పంపండి.. నాకు బ్రతకాలని లేదు. నాకు ఉరి శిక్ష వేసేయండి అంటూ డ్రామాలు ఆడుతుంది.
మాళవిక డ్రామాలాడుతుందని ఝాన్సీ అనగా.. పరమేశ్వర్ అబ్జెక్షన్ చెప్తాడు. జడ్జి తీర్పుని 15 నిమిషాలు వాయిదా వేస్తాడు. ఆ తర్వాత యశ్ మాళవికను ఎందుకు అంత నటించావ్ అవసరమా అంటూ కోప్పడతాడు. లాయర్ ఝాన్సీ ఆర్డినరి లాయర్ కాదు.. చిన్న క్లూ దొరికితే జైల్లో వేయించేస్తుంది అంటాడు యశ్. ఆ తర్వాత వేద మాళవిక మీద ఫైర్ అవుతుంది. సభ్యత, సంస్కారం చీరల్లో, నగల్లో ఉండదంటుంది వేద. నాటకాలు కట్టిపెట్టి తప్పు ఒప్పుకో శిక్ష తగ్గుతుందని సూచిస్తుంది వేద. నువ్ ఎన్ని చెప్పినా గెలిచేది నేనే అని పొగరుగా సమాధానమిస్తుంది మాళవిక. గెలిచేది న్యాయం నువ్ కాదు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంటూ సవాల్ విసురుతుంది వేద.
సీన్ కట్ చేస్తే.. కోర్టు కేసు గురించి రత్నం, వరదరాజులు మాట్లాడుకుంటారు. ఈ కేసు వల్ల మన వేద యశ్‌లు ఇంకా దగ్గరవుతారని ఆశిస్తారు. కోర్టులో మనకు అంతా మంచే జరుగుతుందని నమ్మకంతో ఉంటారు. ఆ తర్వాత మళ్లీ కోర్టు సీన్ వస్తుంది. జడ్జి వచ్చి ‘ఝాన్సీ మీరేమైనా అడగాలనుకుంటున్నారా’ అంటుంది. ఎస్ అని చెప్పి మాళవికని ప్రశ్నిస్తుంది లాయర్. పరమేశ్వరం అబ్జెక్షన్ చెప్తాడు. మాళవిక గారూ నాటకాలాడినంత మాత్రాన నిజం అబద్ధం కాదంటుంది ఝాన్సీ. మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? అంటూ ప్రశ్నిస్తాడు జడ్జి ఝాన్సీని.
ఆక్సిడెంట్ జరగడానికి ముందు సులోచన మాళవిక ఇంటికి వెళ్లారు. తన కూతురు కాపురంలో నిప్పులు పోయకూడదని వార్నింగ్ ఇచ్చినందుకు పగతో తన వెనకే వెళ్లి కారుతో గుద్దేసిందని నిజం చెప్తుంది ఝాన్సీ. ఇదంతా అబద్ధం అంటూ అరుస్తుంది మాళవిక. అపుడు నేను ఇంట్లోనే లేనంటుంది మాళవిక. మరెక్కడ ఉన్నారంటూ లాయర్ ప్రశ్నించగా షాపింగ్‌కి వెళ్లానంటుంది. ఏ మాల్ అని అడగ్గా.. అది అది అంటూ నసుగుతుంది మాళవిక. ఝాన్సీ మాళవికను గుచ్చి గుచ్చి ప్రశ్నలడుగుతుంది. మాల్ సీసీటీవీ ఫుటేజి తెప్పిస్తానంటుంది ఝాన్సీ. ప్రూవ్ చేయాలా అని అడగ్గా.. మాళవిక నోట మాట రాదు. ఆ టైంలో మీరు బంజారాహిల్స్‌లో ఉన్నారు. సులోచనని ఆక్సిడెంట్ చేశారు అంటూ వాదిస్తుంది ఝాన్సీ. నేను చేయలేదు.. చేయలేదంటూ అరుస్తుంది మాళవిక. ఎనఫ్ అంటూ పైకి లేస్తాడు యశ్. నీ అబద్ధాలు ఆపు మాళవిక అంటూ కోప్పడతాడు.
బోనులోకి వచ్చి.. మాళవిక చెప్తుంది అబద్ధం అంటాడు యశ్. అబద్ధం చెప్తున్నారని మీకెలా తెలుసంటూ ప్రశ్నిస్తుంది. ఆ టైంలో మాళవిక నాతోనే ఉందంటూ బాంబ్ పేల్చుతాడు యశ్. మరి యశోధర్ ఏం చెప్పి మాళవికని కాపాడతాడో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..