వేద, చిత్రలు బయటికి వెళ్లిన తమ భర్తల కోసం ఎదురుచూస్తుంటారు. ఇరు కుటుంబసభ్యులు కలిసి సంతోషంగా గడుపుతారు. మరోవైపు మాళవిక ఆత్మహత్యాయత్నం చేస్తుంది. అభిమన్యు, యశోదర్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మాళవిక స్టేట్‌మెంట్‌ని రికార్డు చేసుకునేందుకు పోలీసులు ఆస్పత్రికి వస్తారు కానీ తను మాత్రం అభిమన్యుకు జలక్ ఇస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 4 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
యశ్ కోసం ఎదురు చూసి అలసిపోతుంది వేద. ‘సర్‌ప్రైజ్ అయ్యావా. నా సూసైడ్‌కి కారణం నువ్వేనని చెప్పడానికి’ అంటూ బెదిరిస్తుంది మాళవిక. ఇంకోసారి నా ముందు ఆ వేదని నెత్తిన పెట్టుకుంటే నిన్ను వదిలిపెట్టను.. నీ భార్య స్థానాన్ని నేను ఖాళీ చేశాను. ఆ వేద ఎలా భర్తీ చేస్తుంది.. అంటూ క్లాస్ పీకుతుంది యశ్‌కి. నీలాంటి ఆడవాళ్లని నేనెక్కడా ఎప్పుడూ చూడలేదంటూ విసుక్కుంటాడు యశ్. నిజానికి నువ్ సూసైడ్ చేసుకుంటే ఏదో కారణం ఉందనుకున్నా.. ఇప్పటికీ నువ్ ఇద్దరి పిల్లల తల్లివనే విషయం మరిచిపోయావ్.. అంటూ గతాన్ని గుర్తు చేస్తాడు. అసలు నీకు వేద గురించి ఏం తెలుసు అంటూ నిలదీస్తాడు. వేద నువ్ వదిలేసిన భార్య స్థానంలోకి రాలేదని.. నువ్ వదిలేసిన తల్లి స్థానంలోకి వచ్చిందని భార్య గురించి గొప్పగా చెబుతాడు. వేద అంటే అమ్మ.. అమ్మ అంటే వేద.. నిన్ను చూస్తే నాకు జాలేయడం లేదు. ఎందుకంటే ఆ పదం చిన్నదై పోతుంది.. ఇప్పటికైనా తప్పు తెలుసుకో అంటూ అర్థమయ్యేలా వివరిస్తాడు మాళవికకు. ఈ సృష్టిలో నాకు తెలిసి నీకంటే అనాథ ఎవరూ లేరు అది తెలుసుకో అంటూ వెళ్లిపోతాడు యశ్.
సీన్ కట్ చేస్తే.. వేద భర్త దగ్గరికి వెళ్లి వచ్చిందే ఆలస్యంగా.. నా దగ్గరికి వచ్చి పలకరించాల్సింది లేదా అంటూ నిలదీస్తుంది. ఓ చీటి ఇచ్చి చదవమంటుంది. అంతా కొట్టివేత ఉంది ఇందులో ఏం చదవాలి అంటాడు యశ్. ఫంక్షన్‌లో నుంచి వెళ్లిపోయారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదేంటి అని అడుగుతుంది భర్తని. ‘సారీ వేద.. నేను నీ ఫోన్ లిప్ట్ చేసే స్థితిలో లేను. ఆ మాళవిక ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆ మాళవిక నా మీద పగబట్టింది’ అంటూ హాస్పిటల్‌లో జరిగిందంతా చెబుతాడు యశ్. నాకు నా పిల్లల గురించి బెంగ ఉందని బాధపడతాడు. ‘ఖుషీ చేసుకున్న అదృష్టం నా కొడుకుకు లేదు. అమ్మలా పెంచాల్సిన మాళవిక చేతులు దులుపేసుకుంది. ఇపుడు కూడా ఆది ఒక మూలన పడి ఉంటాడు. ఆ అభిమన్యు ఇంటికెళ్లి తాగి దొర్లుతూ ఉంటాడు. నా కొడుకు నా రక్తం. పట్టించుకునే అవకాశం లేదు’ అనుకుంటూ ఎమోషనల్ అవుతాడు యశోదర్. ఏంటండీ.. చిన్న పిల్లాడిలా.. ఇపుడు ఆదిత్య ఆకలి తీర్చాలి అంతే కదా.. నాతో రండి అంటూ బలవంతంగా తీసుకెళ్తుంది వేద యశోదర్‌ని.
ఆ తర్వాత సీన్‌లో ఆస్పత్రిలో ఉన్న ఆది దగ్గరికి వెళ్తారు వేద దంపతులు. అందరూ ఉండి కూడా అనాథలా ఎలా ఉన్నాడో చూడు అంటూ బాధపడతాడు యశ్. అన్నం తినిపిద్దాం పద వేద అని యశ్ చెప్పగా.. నిన్ను చూస్తే ఆది మళ్లీ డిస్ట్రబ్ అవుతాడు అంటూ వేద ఒక్కతే వెళ్తుంది. బొమ్మని తీసుకుని.. వేద డాక్టర్‌లా ఆది దగ్గరికి వెళ్తుంది. ఆదితో ఆటలాడుతూ అన్నం తినిపిస్తుంది వేద. చాటుగా అది చూసి సంతోషిస్తాడు యశ్. ‘నా ఆకలి తీర్చారు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఒకసారి మీ మాస్క్ తీయరా’ అంటాడు ఆది. దానికి వేద ఒప్పుకోకపోయినా మాస్క్ లాగుతాడు ఆది. ‘ఆదిత్య.. నాకు ఖుషీ ఎలాగో నువ్ కూడా అంతే’ అంటుంది వేద. నేనిపుడు ఒకటి అడుగుతాను మీరు చేస్తారా అంటూ ప్రశ్నిస్తాడు ఆది వేదని. అడుగు చేస్తా అని చెప్పగా.. ‘మా నాన్నని వదిలిపెట్టి వెళ్లిపో. మా మామ్ సూసైడ్ చేసుకుంది మీ వల్లనే. మా నాన్నని, ఖుషీని మాకు ఇచ్చేసి నువ్ ఎక్కడికైనా దూరంగా వెల్లిపో. నువ్ వెళ్లిపోతే మా డాడీ మాదగ్గరకు వచ్చేస్తాడని మా మామ్ చెప్పింది’ అంటూ ఏడుస్తాడు ఆది. ఆ మాటలు విన్న వేద, యశ్‌లు షాకవుతారు. నిద్రలో కూడా వేద అదే కలవరిస్తూ బాధపడుతంది. ఆ తరువాత ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..