చిత్ర, వసంత్‌ల ప్రేమ కథ సుఖాంతమైనందుకు యశ్, వేద కుటుంబసభ్యులు ఆనందపడిపోతారు. దానికి కారణం మా అల్లుడు అంటే.. కాదు కాదు మా కోడలు అనుకుంటారు ఇరువురు. మీ గొప్పలు మా దగ్గర కాదంటే.. మీ గొప్పలు మా దగ్గర కాదంటూ వేద, యశ్ ఫ్యామిలీలు సరదాగా గొడవపడుతారు. ‘నువ్వేమో కూతురు గొప్ప కాదు అల్లుడు గొప్ప అంటున్నావ్.. నువ్వేమో కొడుకు కాదు కోడలు గొప్ప అంటున్నావ్. దీన్నే మార్పు అంటారు’ అని చెప్తారు. ఏ సులోచన దీన్నే చేంజ్ అంటారు అంటూ యశ్ తల్లి చెప్తుంది. అంతలోనే చిత్ర.. వసంత్ కోసం వెతుకుతూ కనిపిస్తుంది. ఏ చిత్ర ఏం వెతుకుతున్నావ్ అనగా.. వసంత్ కనిపించట్లేదు అంటుంది చిత్ర. ఈ పాటికే నువ్ కొంగుకు కట్టేసుకున్నావ్ అనుకున్నా.. అంటూ ఎగతాళి చేస్తుంది యశ్ తల్లి. లోపల వేద ఉంది వెళ్లి అడుగు అంటూ పంపిస్తుంది సులోచన. వసంత్ కనిపించట్లేదు ఏంటక్కా అని అడగ్గా.. రోలు వెళ్లి రోకలితో మొరపెట్టుకోవడం అంటే ఇదే మరి అంటుంది వేద. ఇద్దరూ కలిసి వెళ్లిపోయారా అయితే అని చెప్పుకుంటారు అక్కాచెళ్లెల్లు. ‘మాకు మొన్ననే ఎంగేజ్‌మెంట్ అయింది అపుడే వదిలి వెళ్లాడు. రానీయ్ వచ్చాక ఆయన సంగతి చెప్తా’ అని చిత్ర అనగానే.. మొన్ననే పెళ్లయిన నన్ను వదిలి వెళ్లిన ఆయన రానీయ్.. సంగతి చెప్తా అంటుంది వేద.
సీన్ కట్ చేస్తే.. మాళవిక ఆస్పత్రి బెడ్ మీద ఉంటుంది. బయటే ఉన్న యశ్, డాక్టర్‌ల దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చిన అభిమన్యు మాళవిక ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకుంటాడు. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్.. అంటుంది డాక్టర్. అంతలోనే పోలీసులు వచ్చి మాళవిక స్టేట్‌మెంట్ కావాలంటూ అడుగుతారు డాక్టర్‌ని. అభిమన్యు ఇప్పుడు ఉంటుంది నీకు అంటూ యశ్‌తో బెట్ కడతాడు. అక్కడ వేద రాత్రయినా యశ్ ఇంటికి రాలేదని ఎదురుచూస్తుంది. కారు చప్పుడు కాగానే తన భర్తేమోనని ఆత్రుతగా చూస్తుంది. కానీ వచ్చింది తను కాదు అనుకుంటుంది మళ్లీ. వచ్చాక బెస్ట్ సీఈవోకు తనేంటో చూపిస్తాననుకుంటుంది.
బెడ్ మీద ఉన్న మాళవిక దగ్గరికి కొడుకు వెళ్లి.. ‘మామ్.. నీకేం కాలేదు కదా. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నన్ను వదిలి వెళ్లవ్ కదా. ఐ లవ్ యూ మామ్’ అంటాడు. నిన్ను వదిలి నేను వెళ్లనని మాటిస్తుంది మాళవిక. అంతలోనే పోలీసులు వచ్చి… బాబుని బయటికి పంపిస్తారు. ‘మీ ఆత్మహత్యకు కారణమేంటి. మిమ్మల్ని సూసైడ్‌కి ప్రేరేపించిందెవరూ..’ అంటూ ప్రశ్నలు సంధిస్తారు. నా ఆత్మహత్యకు కారణం ఏంటో చెప్తానంటూ.. పోలీసులకు వివరిస్తుంది మాళవిక. బయట యశ్, వసంత్‌లు మాళవిక ఏం చెప్తుందోనని కంగారు పడతారు. అసలే ఈ మాళవిక నీమీద పగ బట్టేసింది అంటాడు వసంత్. నేను నిజాయితీగా ఉన్నా. నా తప్పు లేనంత వరకు ఎవరికీ భయపడేది లేదంటూ ధైర్యంగా చెబుతాడు యశ్. అక్కడ అభిమన్యు వాళ్లు యశ్ కంగారును చూసి సంతోషపడిపోతారు. ‘మనిద్దరి మధ్య ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది యశోధర్. నిన్ను ఫినిష్ చేయాలని చాలాసార్లు చూశా కానీ.. నా చేతికి మట్టి అంటకుండా నీ మాజీ భార్యే నీ సమాధికి పునాది వేస్తుంది. లోపల మాళవిక ఇచ్చిన స్టేట్‌మెంట్‌కి పోలీసులు వచ్చి నిన్ను ఇపుడు అరెస్ట్ చేస్తారు’ అంటూ గర్వంగా చెప్తాడు అభిమన్యు.
‘ఏంటి బావగారు. నేను కొంపదీసి యశోదర్ కోసం ఎదురు చూస్తున్నానని అనుకుంటున్నారా?’ నేనేం చూడట్లేదు అంటుంది వేద. నిన్ను ఇలా చూస్తే చాలా సంతోషంగా ఉంది వేద. లేట్ నైట్‌లో వచ్చే భర్త కోసం ఎదురుచూస్తున్న భార్యలా అంటాడు అతడు. ‘నాకు అంత లేదు. ఆ అదృష్టం మాళవికకే దక్కింది’ అంటుంది కొంచెం బాధగా. మాళవిక ప్రస్తావన తెస్తున్నావేంటి ‘నువ్ ఈ పెళ్లి చేసుకున్నది ఖుషికి తల్లి అవడానికే అనేదానివి కద వేద.. అంటే మీ రిలేషన్‌లో కొత్త అనుభూతులు వస్తున్నావ్’ అంటాడు వేద బావ. అలాంటిదేం లేదు బావ.. అంటూ సరదాగా చెప్తుంది వేద.
అదే అదనుగా భావించిన యశ్ బామ్మర్ది.. మిమ్మల్ని లోపల వేయించి నేను ఎంజాయ్ చేస్తా ఇపుడు అంటాడు. కోపంగా బామ్మర్ది గళ్ల పట్టుకుంటాడు యశ్. మరోవైపు పోలీసులు మాళవిక దగ్గర స్టేట్‌మెంట్ తీసుకోవడం కంప్లీట్ అవుతుంది. బయటికి వెళ్లిన పోలీసులను అభిమన్యు తన సూసైడ్‌కి ఎవరు కారణమని చెప్పింది అని అడుగుతాడు ఉత్సాహంగా. తన ఆత్మహత్యకు తనే కారణమని మాళవిక చెప్పింది పోలీసులు అభిమన్యుకు చెప్పడంతో అందరూ షాకవుతారు. అలా అనడమేంటని ఆశ్చర్యపోతాడు. ‘తను రోజూ వాడే ప్రిల్స్‌నే ఈ రోజు ఎక్కువ డోస్‌లో వేసుకుందట’ అని చెప్తారు పోలీసులు. తను వేరే ఎవరి పేరైనా చెప్పి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదంటారు. యశ్ తప్పించుకున్నందుకు అభిమన్యుకు పెద్ద షాక్ తగులుతుంది. మాళవిక యశోదర్‌ని కలవాలనుకుంటున్నట్టు చెప్పి తనని లోపలికి పంపిస్తారు పోలీసులు. ‘షాక్ అయ్యావా. నేను నీ పేరు చెప్పడానికి నిమిషం చాలు. ఎందుకు వదిలేశానో తెలుసా. ఎక్కడ నీ పెళ్లం వేదకి నీమీద ప్రేమ పొంగిపోతుందోనని’ అంటుంది మాజీ భర్తతో. మరి మాళవిక మీద అభిమన్యు రియాక్షన్ ఏంటో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..